AU: నేను ప్రభుత్వాలకు దగ్గరి వ్యక్తిని కాదు.. ప్రొ. ఘంటా చక్రపాణి ఆసక్తికర వ్యాఖ్యలు

by Ramesh Goud |

డా.బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ(Dr. BR Amedkar Open University) నూతన వీసీ(VC)గా నియామకం అయిన మాజీ టీఎస్పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి(Pro.Ganta Chakrapani) బాధ్యతలు స్వీకరించారు.

AU: నేను ప్రభుత్వాలకు దగ్గరి వ్యక్తిని కాదు.. ప్రొ. ఘంటా చక్రపాణి ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: డా.బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ(Dr. BR Amedkar Open University) నూతన వీసీ(VC)గా నియామకం అయిన మాజీ టీఎస్పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి(Pro.Ganta Chakrapani) బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో కేసీఆర్(KCR).. ఇపుడు రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తనకు పిలిచి అవకాశం ఇచ్చారని, వారిని నేను ఎప్పుడూ కృతజ్ఞుడుగా ఉంటానని చెప్పారు.

ఒక ప్రభుత్వానికి దగ్గర ఉన్న వ్యక్తి వేరే ప్రభుత్వానికి దూరంగా ఉంటారని అందరూ అనుకుంటారు.. కానీ నేను తెలంగాణ(Telangana)కు దగ్గర వ్యక్తిని అందుకే నాకు అవకాశం వచ్చిందని భావిస్తున్నానని చెప్పారు. అలాగే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని నెంబర్ వన్ గా అభివృద్ధి చేసే లక్ష్యంగా కృషి చేస్తానని స్పష్టం చేశారు. అంబేద్కర్ యూనివర్సిటీతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని.. దాదాపు 32 ఏళ్ళు ఇక్కడ పనిచేసిన అనుభవం ఉందని తెలిపారు. అంబేద్కర్ యూనివర్సిటీ అంటే సెకండ్ గ్రేడ్ యూనివర్సిటీ అనే అపోహ ఉందని, దానిని తొలగించి, నెంబర్ వన్ యూనివర్సిటీగా చెప్పుకునే విధంగా ముందుకు తీసుకెళతానని చక్రపాణి వెల్లడించారు.

Next Story