- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకులు ప్రొఫెసర్ కె.నాగేశ్వర్‌ను అరెస్టు చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన కేసుల ఆధారంగా ఆయనను అరెస్టు చేయాలని చూడడం ఆందోళనకరమని పేర్కొంది. ఈ మేరకు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రజనీకాంత్, కార్యదర్శి టి.నాగరాజు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గత నాలుగు దశాబ్దాలుగా సామాజిక, రాజకీయ అంశాలపై ప్రొఫెసర్ నాగేశ్వర్ నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్య దృక్పథంతో అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారని ఎస్‌ఎఫ్‌ఐ నేతలు గుర్తుచేశారు. నిరంతరం ప్రభుత్వ విధానాలను విమర్శనాత్మకంగా విశ్లేషిస్తూ, ప్రజాస్వామ్య చర్చలకు ఆయన దోహదపడుతున్నారని కొనియాడారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు, ముఖ్యమంత్రులు సైతం గతంలో ఆయన అభిప్రాయాలను గౌరవించారని పేర్కొన్నారు.
Next Story






