- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్నికల ముందే దాడులు చేస్తున్నారు.. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి
జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికల పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా అన్ని చోట్ల ప్రశాంతంగా కొనసాగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నిక పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా అన్ని చోట్ల ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీపై బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి (Lakala Deepak Reddy) సంచలన ఆరోపణలు చేశారు. పోలింగ్‌కు ముందే షేక్‌పేట్ (Shaikpet)లో బీజేవైఎం కార్యకర్తలపై కాంగ్రెస్ నేతలు దాడులకు దిగారని ఆరోపించారు. తమ పని తాము చేసుకుంటూ ఉంటే తమ కార్యకర్తలను రక్తాలు వచ్చేలా కొట్టారని ఫైర్ అయ్యారు. పోలింగ్‌కు ముందే పరిస్థితి ఇలా ఉంటే భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలకు గమనించాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హల్‌చల్ చేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలలో నెంబర్‌వన్ సరిగ్గా లేదన్నారు. ఈ విషయాన్ని తాను ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు.






