- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పందుల విషయంలో వేట కొడవళ్ళతో దాడి
పందుల విషయంలో మాట మాట ఓ పెరిగి వేటకొడవళ్ళతో ఒకరికి హత్య చేసిన ఘటన కల్వకుర్తి డివిజన్ లో చోటు చేసుకుంది. ప్రత్యక్ష

పందుల విషయంలో వేట కొడవళ్ళతో దాడి
- ఒక వర్గంపై మరొక వర్గం దాడి
- ఒకరు మృతి, 3 గురికి తీవ్రగాయలు
- 4 నిందితులను గుర్తింపు
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
దిశ, కల్వకుర్తి/ వెల్డండ : పందుల విషయంలో మాట మాట ఓ పెరిగి వేటకొడవళ్ళతో ఒకరికి హత్య చేసిన ఘటన కల్వకుర్తి డివిజన్ లో చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల వివరాల్లోకి వెళితే.... బుధవారం సాయంత్రం వెల్డండ మండలంలో పందుల పంచాయితీ పత్యార్థుల దాడిలో ఒకరి మృతి చెందగా నలుగురు గాయాలయ్యాయి. వెల్దండలో పందుల దొంగతనం చేశారనే నేపంతో ఘర్షణకు దిగిన ఇరువర్గాలు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఇరువర్గాల దాడిలో కల్వకుర్తి పట్టణం విద్యానగర్ చెందిన బెల్లంకొండ రాములు (43) కత్తిపోట్లకు గురై మృతి చెందాడు. పందులు కొంతమంది దొంగతనం చేసి వెల్దండ శివారులో ఒక షెడ్డు ఏర్పాటు చేసుకొని అక్కడ పందులను పెంపకం చేస్తున్నారని సమాచారంతో బెల్లంకొండ రాములు తోపాటు 14 మంది కలిసి అక్కడి వెళ్లి చూడగా అందులో కొన్ని పందులు తనవేనని తెలుసుకుని పెంపకం దారులతో ఘర్షణకు దిగారు. అవేశానికి గురైన అవతలివర్గం రాములు పై మరో నలుగురిపై కత్తులతో దాడి చేసి అక్కడి నుండి పరారయ్యారు. దాడిలో రాములు మృతిచెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాల పాలైన 4 నలుగురిని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్దండ పోలీసులు తెలిపారు. కల్వకుర్తి ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకోనడంతో డివిజన్ పోలీసుల మోహరించారు.






