హైదరాబాద్‌లో దారుణం..వేరే మతస్తుడితో బయటకు వచ్చిందని యువతిపై దాడి

by Ajay Maddhiboyina |   (  Updated:2025-07-29 15:39:51  IST  )

వేరే మతస్తుడితో కలిసి బయటకు వచ్చిందని పోకిరీ యువతిపై దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ

హైదరాబాద్‌లో దారుణం..వేరే మతస్తుడితో బయటకు వచ్చిందని యువతిపై దాడి
X

దిశ, వెబ్ డెస్క్: వేరే మతస్తుడితో కలిసి బయటకు వచ్చిందని పోకిరీ యువతిపై దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌కు ట్యాగ్ చేశారు. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్‌పైనే ఈ ఘటన చోటు చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఓ జంట రాత్రిపూట ట్యాంక్ బండ్ పై మాట్లాకుంటూ వెళుతుండగా ఓ వ్యక్తి వీడియో రికార్డ్ చేస్తూ నీ పేరేంటి అని అడుగుతూ ఇబ్బందులకు గురి చేశాడు.

నీకు అవసరం లేదంటూ యువతి సమాధానం చెప్పగా బుర్కా తీయాలి అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. బుర్కా తీసేయ్.. మమ్మల్ని ఎందుకు బద్నాం చేస్తున్నావ్ అంటూ దాడికి పాల్పడ్డాడు. అక్కడ నుండి వెళ్లిపోయేందుకు జంట సిద్ధమవ్వగా బైక్ కీ సైతం గుంజుకునేందుకు ప్రయత్నించాడు. అక్కడితో ఆగకుండా బూతులు తిడుతూ జంటపై దాడి చేశారు. బైక్ స్టార్ట్ చేసిన తరవాత కూడా వెంబడిస్తూ దాడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవ్వగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Next Story