ఎమ్మెల్యే సామేల్ ఇంటిపై దాడి..ఖండించిన నేత‌లు

by velandi.Saikiran |   (  Updated:2026-03-16 20:45:42  IST  )

బోడుప్పల్‌లోని ఎమ్మెల్యే మందుల సామెల్ నివాసానికి చేరుకుని ఆయనకు మద్దతుగా నిలిచారు కాంగ్రెస్ నేత‌లు.

ఎమ్మెల్యే సామేల్ ఇంటిపై దాడి..ఖండించిన నేత‌లు
X

దిశ, మేడిపల్లి : బీజేపీ నాయకులు చేసే దాడులు తెలంగాణలో సహించమని కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్ర‌నేత‌లు హెచ్చ‌రించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కొంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్, మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, ఓయూ ప్రొఫెసర్ కాసిం తదితరులు బోడుప్పల్‌లోని ఎమ్మెల్యే మందుల సామెల్ నివాసానికి చేరుకుని ఆయనకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే మందుల సామెల్ తన వ్యాఖ్యలను ఇప్పటికే వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పినప్పటికీ, ఎమ్మెల్యే ఇంటిపై బీజేపీ నాయకులు దాడి చేయడం అత్యంత నీచమైన చర్య అని విమర్శించారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు సంబంధించిన వ్యక్తులే ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బాధ్యత వహించాలని, దాడికి పాల్పడిన వారిని పార్టీ నుండి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల్లో బీజేపీ నాయకులు చేసే ఇలాంటి దాడులు తెలంగాణలో సహించబోమని హెచ్చరించారు. ఈ సందర్భంగా దాడికి పాల్పడిన బీజేపీ, బీజేవైఎం వారిలో అరుగురిపై కేసు నమోదు అయినట్టు సమాచారం అందుతోంది.

Next Story