కాంగ్రెస్ గెలిచి 24 గంటలు కాకముందే బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తున్నారు: కేటీఆర్

by Malleboina Mahesh |   (  Updated:2025-11-15 06:34:35  IST  )

బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) శనివారం ఉదయం మాగంటి సునీత(Maganti Sunitha) నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలిశారు.

కాంగ్రెస్ గెలిచి 24 గంటలు కాకముందే బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తున్నారు: కేటీఆర్
X

దిశ, వెవ్ డెస్క్: బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) శనివారం ఉదయం మాగంటి సునీత(Maganti Sunitha) నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలిశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేసిన తీరును ఈ సందర్భంగా కేటీఆర్ అభినందించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని కేటీఆర్ ధైర్యం చెప్పారు. సునీత తో పాటు వారి పిల్లలను కూడా ప్రశంసించారు. అనంతరం ఆయన బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. "జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు కాకముందే, కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులపై దాడులకు దిగారు.

మా హయాంలో ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత మా నాయకులు, కార్యకర్తలు ఇలా హద్దులు దాటి ఏనాడైనా దాడులు చేశారా, నిన్న కారు గుర్తును అవహేళన చేశారు. మేము 7 ఉప ఎన్నికల్లో, 2 కార్పొరేషన్ ఎన్నికల్లో, జిల్లా పరిషత్ ఎన్నికల్లో గెలిచాం కానీ విర్రవీగలేదని, కాంగ్రెస్ పార్టీ నేతల్లా చిల్లరగా ప్రవర్తించలేదని కేటీఆర్ గుర్తు చేశారు. అలాగే ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లు గానే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నాది. మా కార్యకర్తల మీద దాడి చేసిన వారిని వదిలిపెట్టే సమస్యే లేదు అంటే కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

Next Story