- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి క్యాంపు కార్యాలయంపై దాడి.. స్పందించిన పార్టీ చీఫ్ రాంచందర్ రావు
ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి క్యాంపు కార్యాలయంపై చేసిన దాడిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు ప్రకటించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : తమ పార్టీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ చేసిన దాడిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు ప్రకటించారు. ప్రజాస్వామ్యంలో చర్చకు స్థానం ఉండాలి, కానీ హింసకు కాదన్నారు. శనివారం ఒక ప్రకటనలో ఆయన స్పందిస్తూ, కాంగ్రెస్ నాయకుల రాజకీయ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి అల్లర్లకు పాల్పడటం అత్యంత దుర్మార్గంగా ఉందని ఆరోపించారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.. కామారెడ్డిలో ప్రజల ప్రశాంతతకు భంగం కలిగిస్తే బీజేపీ సహించదని హెచ్చరించారు. మా పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడుతామని, పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించి నిజాలు ప్రజల ముందుకు తీసుకురావడం కోసం తాను స్వయంగా సంఘటన స్థలాన్ని సందర్శిస్తానని తెలిపారు. హింసను ప్రోత్సహించే రాజకీయాలను బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించే ప్రసక్తే లేదన్నారు.
బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ ఇతర నేతలను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మెప్పు పొందాలనే దురుద్దేశంతో యువ మోర్చా నాయకులను అసభ్య పదజాలంతో దూషిస్తున్న పోలీసులపై వెంటనే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తే సహించేది లేదని మండిపడ్డారు. తమది కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అని గుర్తించుకోవాలని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం బాధ్యతగా భావిస్తున్నామన్నారు. ఏఐ గ్లోబల్ సమ్మిట్ వద్ద కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు దేశమంతా అవమానభారంతో ఉందని అన్నారు. ఈ సంఘటనను నిరసిస్తూ తమ పార్టీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే పోలీసులు దుర్భాషలాడి దాడులు చేశారని ఆరోపించారు. పోలీసులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలి.. రాహుల్ గాంధీ మెప్పు పొందడానికి చేస్తున్న కార్యక్రమాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని, దుర్భాషలాడిన పోలీస్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.






