రాష్ట్రంలో దారుణ ఘటన.. ఇద్దరు మహిళల హత్య

by Yella Dhawani Reddy |   (  Updated:2025-08-08 06:34:30  IST  )

జనగామ జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. శుక్రవారం ఉదయం గుర్తు తెలియని దుండగులు ఇద్దరు మహిళలను హత్య చేశారు.

రాష్ట్రంలో దారుణ ఘటన.. ఇద్దరు మహిళల హత్య
X

దిశ, వెబ్ డెస్క్: జనగామ (Janagaon) జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. జఫర్‌గడ్ మండలంలోని తుమ్మడపల్లిలో ఇద్దరు మహిళలు హత్యకు (Murder) గురయ్యారు. గురువారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న తల్లి (75), కుమార్తె (45)ను గుర్తుతెలియని దుండగులు చంపేసి, పారిపోయారు. శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆస్తి తగాదాలతోనే ఈ హత్యలు చోటుచేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story