- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నల్లగొండలో దారుణం.. విద్యార్థి వేడుకున్నా వదలకుండా గొంతు పిసికిన టీచర్
నల్లగొండ జిల్లా కేంద్రంలో దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దిశ, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నల్లగొండలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో ఉపాధ్యాయులు బాలురను రక్తం వచ్చేలా.. విచక్షణ రహితంగా చితకబాదారు. ‘సారు.. మీ కాళ్ళు మొక్కుతా అని బతిమిలాడినా కర్ర, వైర్‌తో చితకబదినట్లు పిల్లలు ‘దిశ’తో వాపోయారు. అలాగే గొంతు పిసికినట్లు విద్యార్థి ఆరోపించారు. అంతలా పిల్లలను కొట్టాల్సిన అవసరం ఏం వచ్చిందని పిల్లల తల్లిదండ్రులు అక్కడికి వచ్చి ప్రిన్సిపాల్ని నిలదీశారు. దీంతో ప్రిన్సిపాల్ వేణు గోపాల్ తల్లిదండ్రులుకు క్షమాపణలు చెప్పి.. తన తప్పిదమే అని ఒప్పుకున్నారు. అలాగే 7వ తరగతి విద్యార్థులను ముగ్గురు ఉపాధ్యాయులు బలంగా కొట్టారు. కొట్టిన వారిలో జ్యోతి బాబు ఇంగ్లీష్ ఉపాధ్యాయులు,సయ్యద్ బాబా ఫిజిక్స్ ఉపాధ్యాయులు ఉన్నారు. 7వ తరగతిలోనే కాకుండా.. 6వ తరగతిలో కూడా ఈ పాశవిక ఉపాధ్యాయుల చేతిలో పాశవికంగా దెబ్బలు తిన్నట్లు తెలుస్తుంది.
ప్రిన్సిపాల్ వేణుగోపాల్ మాట్లాడుతూ.. తప్పు జరిగింది నన్ను క్షమించండి అని వేడుకున్నారు. అలాగే చేతులు జోడించి వారిని బ్రతిమిలాడారు. జరగకూడనిది జరిగింది ఈ ఒక్కసారి క్షమించండి అని అన్నారు. పిల్లలను ఎవరు చేయి చేసుకోకుండా చూసుకుంటామని తెలిపారు. అలాగే సీసీ కెమెరాల పనిచేయడం లేదని,వాటి మీద సమగ్ర విచారణ జరుపుతామని ప్రిన్సిపాల్ వేణుగోపాల్ తెలిపారు.






