ప్రైవేట్ హాస్టల్‌లో దారుణం.. వంట పాత్రల్లోనే మూత్రవిసర్జన చేసిన మహిళ.. దానితోనే వడ్డింపు (వీడియో)

by Disha Web Desk 6 |
ప్రైవేట్ హాస్టల్‌లో దారుణం.. వంట పాత్రల్లోనే మూత్రవిసర్జన చేసిన మహిళ.. దానితోనే వడ్డింపు (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: ఉన్నత చదువుల కోసం లేదా ప్రభుత్వ ఉద్యోగాల కోసం చాలా మంది విద్యార్థులు ఇంటికి, తల్లిదండ్రులకు దూరంగా ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటారు. ఇంట్లో ఉన్నట్టుగా భోజనం లేకపోయినా సరే సర్దుకుపోయి వేలకు వేలు ఫీజులు కట్టి ఉంటుంటారు. కడుపునిండా భోజనం తినకపోయినా జీవిత లక్ష్యాన్ని సాధించడం కోసం ఎంత కష్టాన్ని అయినా భరిస్తారు. కానీ ఓ ప్రైవేట్ హాస్టల్లో వంట చేసే మహిళ వంట పాత్రలను మూత్ర విసర్జనకు వినియోగించడం తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా మంకమ్మతోటలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో వంట మనిషి చేసిన నిర్వాకానికి విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. వంట గదినే టాయి‌లెట్‌గా మార్చుకుని వంట చేసే పాత్రలో మూత్ర విసర్జన చేసి సింక్‌లో పడేసింది. మళ్లీ ఆ పాత్రలను వంటలకు వినియోగిస్తుంది. ఆ వంట మనిషి చేసినదంతా సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. అది చూసిన విద్యార్థులు ఆ వీడియోను గుర్తుకు తెచ్చుకుని నోట్లో ముద్ద పెట్టాలంటేనే జంకుతున్నారు. ఇన్ని రోజులు హాస్టల్‌లో తిన్న ఆహారాన్ని తలుచుకుని వికారించుకుంటున్నారు. సీసీ కెమెరా వీడియో ఆధారంగా విద్యార్థులంతా కలిసి ఫుడ్ సెఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు ఇప్పటి వరకు ఆ హాస్టల్ నిర్వాహకులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.



Next Story

Most Viewed