Street Dog Attack: కరీంనగర్‌లో దారుణం.. 18 నెలల బాలుడిపై వీధి కుక్క దాడి

by Ramesh Goud |

18 నెలల బాలుడిపై వీధికుక్క దాడి చేసిన దారుణమైన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది.

Street Dog Attack: కరీంనగర్‌లో దారుణం.. 18 నెలల బాలుడిపై వీధి కుక్క దాడి
X

దిశ, డైనమిక్ బ్యూరో: 18 నెలల బాలుడిపై వీధికుక్క దాడి చేసిన దారుణమైన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ మధ్యకాలంలో వీధికుక్కల దాడులు ఎక్కువ అవుతున్నాయి. పెద్ద చిన్న లేకుండా దారిన వెళ్లేవారిపై తెగ దాడులు చేస్తున్నాయి. ఈ సంఘటనలు వింటుంటే ప్రజలు బయటకి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఇప్పుడు ఇలాంటి ఘటనకు సంబందించిన వీడియోనే నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలోని సమాచారం ప్రకారం.. కరీంనగర్ పట్టణంలోని శాతవాహన యూనివర్సిటి సమీపంలో హరిచందన్ అనే 18 నెలల వయసున్న బాలుడు తన స్నేహితుడితో కలిసి రోడ్డు పక్కన ఆడుకుంటున్నాడు.

అదే సమయంలో అటుగా వెళుతున్న ఓ వీధికుక్క ఉన్నట్టుండి ఒక్కసారిగా బాలుడిపై దాడి చేసింది. పిల్లాడి మొహంపై కరవసాగింది. ఇది గమణించిన ఓ వ్యక్తి దగ్గరకి వెళ్లి కుక్కను గద్దించడంతో అది బాలుడిని వదిలి పారిపోయింది. వీధికుక్క దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడటంతో కుటుంబసభ్యులు కరీంనగర్ లోని ఆసుపత్రిలో చేర్పించారు. ఈ భయానక ఘటన అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని, వీధి కుక్కల దాడులలో ఎక్కువగా పిల్లలే బలి అవుతున్నారని అంటున్నారు. అలాగే వీటికి తక్షణమే పరిష్కారం కనుగొనాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Next Story