అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పేపర్-I ప్రైమరీ కీ విడుదల

by Ramesh Naini |

అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) పేపర్–I ప్రైమరీ కీ విడుదల అయింది.

అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పేపర్-I ప్రైమరీ కీ విడుదల
X

దిశ, డైనమిక్ బ్యూరో: అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) పేపర్–I ప్రైమరీ కీ విడుదల అయింది. ఈ నెల 14న తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) ఆధ్వర్యంలో నిర్వహించిన APP పేపర్-I ప్రైమరీ కీని అధికారిక వెబ్‌సైట్ www.tgprb.inలో అందుబాటులో ఉంచినట్లు చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైమరీ కీపై అభ్యంతరాలను డిసెంబర్ 24 సాయంత్రం 5 గంటలలోగా ఆన్లైన్‌లో సమర్పించవచ్చని పేర్కొన్నారు.

అలాగే తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL)లో 60 పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను జనవరి 20 నుంచి 31 వరకు హైదరాబాద్‌లోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపిక ప్రక్రియకు సంబంధించిన తదుపరి వివరాలు బోర్డు వెబ్‌సైట్‌లో వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.

Next Story