- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాళోజీ హెల్త్ యూనివర్సిటీ లో విద్యార్థినికి అసిస్టెంట్ ప్రొఫెసర్ లైంగిక వేధింపులు..!
కాళోజీ హెల్త్ యూనివర్సిటీ లో విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: కాళోజీ హెల్త్ యూనివర్సిటీ (Kaloji Health University)లో విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు తెలుస్తోంది. యూనివర్సిటీ లో చదువుతున్న విద్యార్థినిపై సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్ (Assistant Professor) లైంగిక వేదింపులకు (Sexual harassment) పాల్పడటం, రాత్రిపూట అసభ్యకర మెసేజ్‌లు పంపి వేధించడం వంటి చర్యలకు పాల్పడినట్లు తాజాగా విచారణ కమిటీ తన నివేదికలో కనుగొంది. దీనిపై విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు యూనివర్సిటీ యాజమాన్యం ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను తక్షణమే విధుల నుంచి తొలగించింది. అయితే, తనపై చర్యలు తీసుకున్నందుకు ఆ ప్రొఫెసర్ విద్యార్థిని పై పగ పెంచుకున్నాడని కమిటీ విచారణలో తేలినట్లు తెలుస్తుంది. ఆ పగతోనే సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్, విద్యార్థిని పీజీ పరీక్షల జవాబు పత్రాలపై ఇంటు మార్క్ వేసి, కావాలనే ఆమెను ఫెయిల్ చేయించాడని యూనివర్సిటీ యాజమాన్యం కమిటీకి తెలిపింది.
'అక్రమంగా పాస్ చేశారని' విమర్శలు రావడంతో..
పైన తెలిపిన విద్యార్థినిని అక్రమంగా పాస్ చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో వైద్యశాఖ అధికారులు (Medical officers) విచారణ కమిటిని ఏర్పాటు చేశారు. ఈ విచారణ సందర్భంగా విద్యార్థిని "తాను అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాశానని, ఫెయిల్ అయ్యే ప్రసక్తే లేదని విద్యార్థిని విజ్ఞప్తి చేయగా, యూనివర్సిటీ అధికారులు ప్రత్యేక పరిస్థితుల్లో ఆమె ఆన్సర్ షీట్‌ను మళ్లీ వాల్యుయేషన్ చేయించి, పాస్ చేసినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. దీంతో విచారణ కమిటీ (Inquiry Committee) పూర్తి నివేదికను తయారు చేసి అధికారులకు అప్పగించనున్నట్లు తెలుస్తుంది.






