- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సభా సంప్రదాయాలను గాలికి వదిలేశారు: డిప్యూటీ సీఎం భట్టి
అసెంబ్లీలో ప్రతిపక్షాల అప్రజాస్వామిక తీరుపై డిప్యూటీ సీఎం భట్టి ఆగ్రహం. రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టిన కీలక బిల్లుపై చర్చకు విజ్ఞప్తి.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో (Telangana Assembly Budget Session) ప్రతిపక్షాల వ్యవహారశైలిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్షాలు అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. బడ్జెట్ ప్రతులను చింపివేయడం, చెవిలో పూలు పెట్టుకుని సభ నుంచి వెళ్లిపోవడం వంటి చర్యలు దురదృష్టకరమని, ఇది తెలంగాణ అసెంబ్లీ విలువలకు విఘాతమని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. సభలో బీఆర్ఎస్ పార్టీ నేతలు బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించాల్సింది పోయి, కేవలం నినాదాలు, చప్పట్లతో సభ సమయాన్ని వృధా చేయడం శోచనీయమన్నారు.
ముఖ్యంగా వృద్ధులు, తల్లిదండ్రుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మానవీయ కోణం తో కూడిన బిల్లుపై చర్చించకుండా అల్లరి చేయడంపై భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుభవజ్ఞులైన సభ్యులే సభా సంప్రదాయాలను విస్మరించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని.. సభలో జరుగుతున్న పరిణామాలను రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని, ఇప్పటికైనా ప్రతిపక్షాలు తమ పద్ధతి మార్చుకుని అర్థవంతమైన చర్చకు సహకరించాలని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క తన ట్వీట్ ద్వారా డిమాండ్ చేశారు.






