Assembly: తెలంగాణ శాసన సభ సమావేశాలు వాయిదా..

by Ramesh Goud |

ఇవాళ ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly Sessions) వాయిదా(Postponed) పడ్డాయి.

Assembly: తెలంగాణ శాసన సభ సమావేశాలు వాయిదా..
X

దిశ, వెబ్ డెస్క్: ఇవాళ ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly Sessions) వాయిదా(Postponed) పడ్డాయి. సమావేశాలను ఈ నెల 16కు వాయిదా వేస్తూ స్పీకర్(Speaker) నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ, మండలి శీతాకాలం సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాక ముందే బీఆర్ఎస్ నాయకులు(BRS Leaders) అసెంబ్లీ(Assembly) ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి, అసెంబ్లీ వద్ద నుంచి తరలించారు. అనంతరం సభ ప్రారంభం కాగా.. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలంగాణ తల్లి విగ్రహ(Telangana Talli statue) నమూనా అంశంపై సభలో వివరణ ఇచ్చారు. దీనిపై సభలో సభ్యుల మధ్య కాసేపు చర్చ జరిగింది. విగ్రహా నమూనా పై సభ్యులు సలహాలు, సూచనలు ఇచ్చారు. తర్వాత ప్రతీ ఏడాది తెలంగాణ తల్లి ఆవతరణ దినోత్సవ వేడుకలు అధికారికంగా జరిపించాలని సభా వేదికగా నిర్ణయించారు. అనంతరం శాసన సభను ఈ నెల 16 కు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Speaker Gaddam Prasad Kumar) ప్రకటించారు.

Next Story