- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు కేబినెట్ సబ్‌కమిటీ ముందుకు కులగణన నివేదిక
స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ అంశాలను తేల్చేందుకు ప్రభుత్వం జెట్ స్పీడ్‌తో కదులుతున్నాయి. ఆదివారం నుంచి వరుసగా సమావేశాలు నిర్వహించి ఆమోదించాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది.

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ అంశాలను తేల్చేందుకు ప్రభుత్వం జెట్ స్పీడ్‌తో కదులుతున్నాయి. ఆదివారం నుంచి వరుసగా సమావేశాలు నిర్వహించి ఆమోదించాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. నివేదికలు ప్రభుత్వానికి అందడం, వాటిని కేబినెట్సబ్కమిటీ అధ్యయనం చేసి కేబినెట్‌కు అందించడం, ఆ తరువాత వాటిని క్యాబినెట్ ఆమోదించి అసెంబ్లీలో చర్చించనున్నారు. శనివారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో రాష్ట్ర మంత్రివర్గం, ఆర్ధిక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సుదీర్ఘంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు, వెంటనే తీసుకోవాల్సిన నిర్ణయాలు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, వాటికి ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి వచ్చిన నిధులు, రాష్ట్ర బడ్జెట్తదితర అంశాలను చర్చించినట్లుగా చర్చించారు. వివిధ శాఖలకు, రంగాలకు బడ్జెట్ అవసరాలు, నిధుల సర్దుబాటుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగే ప్రయోజనం, నష్టం ఏమిటనేది రంగాల వారీగా చేస్తున్నమంత్రివర్గం అధ్యయనం చేసింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనకు ప్రణాళికలపై సమాలోచనలు జరిపారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వర్రావు, దామోదర్‌రాజనర్సింహ, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలను మండలి ఎన్నికలు పూర్తి కాగానే వెంటనే నిర్వహించాలని నిర్నయించారు. దాని కోసం అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలని నిర్నయించారు. దీని కోసం బీసీ డెడికెటెడ్కమిషన్ నివేదిక, ఎస్సీ వర్గీకరణ నివేదికలను తెప్పించుకోని ఆమోదించాలని సమావేశంలో నిర్ణయించారు. ఇందు కోసం ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు కులాగణన నివేదికను రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీకి రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపాల్ సెక్రటరీ సందీప్ సుల్తానీయా అందిస్తారు.
ఈ నివేదికపై చర్చించడానికి సచివాలయంలోని కేబినేట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛాంబర్ లో సమావేశం కానుంది. ఈ సమావేశంలో చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కో-చైర్మన్ దామోదర్ రాజానర్సింహా, సభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవిలు హాజరవుతారు. ప్లానింగ్ కమిషన్ నివేదికపై కేబినెట్సబ్ కమిటీ ఆదివారం, సోమవారాలు చర్చించి ఆమోదిస్తారు. నివేదిక తయారు చేస్తారు. కేబినెట్సబ్ కమిటీ నివేదికను ఈ నెల 5వ తేదీన ఉదయం జరగనున్న రాష్ట్ర కమినెట్ సమావేశంలో ఆమోదం కోసం ప్రవేశపెడుతారు. కేబినెట్ ఆమోదం అనంతరం 5వ తేదీన మద్యాహ్నం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీ సమావేశంలో కులగణన నివేదికను ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. నివేదిక పై ప్రత్యేక చర్చ అనంతరం అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. రాష్ట్రంలో స్థానికసంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్‌లు కల్పించడానికి కులగణణ చేసి నివేదిక తయారు చేయాలని త్రిపుల్ టెస్ట్చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేకంగా బీసీ డెడికేటెడ్ కమిషన్‌ను నియమించింది. సమగ్ర ఇంటింటి సర్వే చేసింది. ఈ సర్వే ఆధారంగా బీసీలకు రిజర్వేషన్‌లు కల్పిస్తారు.
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కి సంబంధించిన సమావేశాలలను ఆదివారం, సోమవారం నిర్వహిస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శనివారం కమండ్ కంట్రోల్ నుంచి మీడియాతో పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కుల సర్వే పై శాసన సభ తీర్మానం మేరకు ప్రత్యేక కమిషన్ వేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ,క్యాబినెట్ మంత్రులు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ ప్రక్రియను పూర్తి చేయడం జరిగిందన్నారు. దీనిని కార్యరూపం దాల్చడానికి శనివారం ఉదయం నుంచి ముఖ్యమంత్రి,ఉప ముఖ్యమంత్రి , సహచర మంత్రులంతా కూర్చొని చర్చించామని తెలిపారు. ప్రధానంగా వర్గీకరణ పై సబ్ కమిటీ తీసుకున్న ప్రొగెసివ్ యాక్టివిటీస్ పై డిస్కస్ చేశామని పేర్కొన్నారు. ఇదేక్రమంలో ఆదివారం, సోమవారం బీసీ కుల సర్వే కి సంబంధించిన సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.






