‘మీ అభిప్రాయం చెప్పండి’.. బీఆర్ఎస్‌కు స్పీకర్ గడ్డం ప్రసాద్ లేఖ

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశం రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నది.

‘మీ అభిప్రాయం చెప్పండి’.. బీఆర్ఎస్‌కు స్పీకర్ గడ్డం ప్రసాద్ లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశం రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నది. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై గెలిచి.. ఆ తర్వాత అధికార కాంగ్రెస్ గూటికి చేరిన పది మంది ఎమ్మెల్యేలపై వేటు కోసం బీఆర్ఎస్ న్యాయపోరాటం చేస్తూనే ఉన్నది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం.. 10 మంది జంపింగ్ ఎమ్మెల్యేలకు స్పీకర్ ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. అయితే.. ఇటీవల ఆ పది మంది ఎమ్మెల్యేలు సైతం స్పీకర్‌కు వివరణ ఇచ్చారు. తాము బీఆర్ఎస్‌లోనే ఉన్నామని.. కేవలం అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిశామని.. తమ ఫొటోలు మార్ఫింగ్ చేసి పార్టీ మారినట్లుగా చూపారని వివరణ ఇచ్చారు. అయితే.. తాజాగా స్పీకర్ గడ్డం ప్రసాద్ బీఆర్ఎస్ పార్టీకి లేఖ రాశారు. పది మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణపై పార్టీ అభిప్రాయాన్ని కోరారు. మూడు రోజుల్లో తమ అభిప్రాయాన్ని వెల్లడించాలని కోరారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా స్పందించబోతున్నదనే ఆసక్తి నెలకొంది.

Next Story