- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు.. గెజిట్ విడుదల చేసిన గవర్నర్
అధికార, విపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది.

దిశ, వెబ్‌డెస్క్: అధికార, విపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు గెజిట్ విడుదలైంది. ఈ మేరకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ (Governor Jishnu Dev Verma) భారత రాజ్యాంగం ఆర్టికల్ 174(1) ప్రకారం తెలంగాణ శాసనసభ ఏడో సమావేశానికి అదే విధంగా శాసనమండలి 25వ సమావేశానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఉభయ సభలు ఈ నెల 29న అసెంబ్లీ, కౌన్సిల్ హాలులో ఉదయం 10.30కి నిర్వహించనున్నట్లు అందులో పేర్కొన్నారు.
అనంతరం నోటిఫికేషన్ డ్రాఫ్ట్ కాపీలను శాసనసభ సెక్రటరీ వీ. నరసింహాచార్యులు (V. Narasimhacharyulu) సీఎం, గవర్నర్ కార్యాలయం, హైకోర్టు, ఆడిటర్ జనరల్, జిల్లా కలెక్టర్లు, రాజ్యసభ, లోక్‌సభ సెక్రటరీలు, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, న్యాయ మంత్రిత్వ శాఖ, ఎన్నికల కమిషన్ వంటి సంస్థలకు చేరవేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం ఇలా అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించాలని సీఎం రేవంత్‌రెడ్డి యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. శాసనసభ సభ్యులందరూ విధిగా అసెంబ్లీ సెషన్స్‌కు హాజరు కావాలని అసెంబ్లీ సెక్రటరీ ఇప్పటికే సమాచారం అందజేశారు.






