- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Assembly: రేవంత్ ఆదేశాలతోనే ప్రతిపక్ష లీడర్ల అరెస్ట్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరోపణలు
రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశాలతోనే బీఆర్ఎస్ నాయకులను(BRS Leaders) అరెస్ట్(Arest) చేశారని కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే(korutla BRS MLA) కల్వకుంట్ల సంజయ్(Klavakuntla Sanjay) ఆరోపించారు.

దిశ, వెబ్ డెస్క్: రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశాలతోనే బీఆర్ఎస్ నాయకులను(BRS Leaders) అరెస్ట్(Arest) చేశారని కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే(korutla BRS MLA) కల్వకుంట్ల సంజయ్(Klavakuntla Sanjay) ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly Meetings) ప్రారంభమైన నేపథ్యంలో అసెంబ్లీ ఎదుట ఆందోళన చేపట్టిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై సంజయ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయమని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారని, స్పీకర్ కాదని తమకు సమాచారం అందిందని తెలిపారు.
ప్రధాన ప్రతిపక్షమైన తమని అసెంబ్లీలోకి ఎందుకు రానివ్వడం లేదో స్పీకర్ చెప్పాలని రిక్వెస్ట్ చేశారు. ఇదే అదానీ ఫోటో ఉన్న టీ షర్ట్ ను రాహుల్ గాంధీ ధరించి పార్లమెంట్ కు వెళ్లారని, అక్కడ అనుమతి ఇచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. పార్లమెంట్ లో రాహుల్ గాంధీ(Rahul Gandhi) అడిగిన ప్రశ్నే మేము కూడా అడుగుతున్నామని, అదానీకి రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధం ఏంటో బయటపెట్టాలని అడుతున్నామని, దీనికి మమ్మల్ని అసెంబ్లీకి రానివ్వకుండా నిర్భందించారని మండిపడ్డారు. అలాగే ఎన్ని అరెస్టులు చేసినా ప్రజల పక్షాన పోరాడి ఈ అక్రమ సంబంధం గురించి బయటపెడతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.






