Assembly: తెలంగాణ సమాజం గుండెల్లో మన్మోహన్​.. సీఎం రేవంత్​ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Ramesh Goud |

రాష్ట్రానికి పురుడు పోసిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్(Manmohan Singh) ను ఎప్పటికీ తెలంగాణ సమాజం గుండెల్లో పెట్టుకుంటుుందని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు.

Assembly: తెలంగాణ సమాజం గుండెల్లో మన్మోహన్​.. సీఎం రేవంత్​ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రానికి పురుడు పోసిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్(Manmohan Singh) ను ఎప్పటికీ తెలంగాణ సమాజం గుండెల్లో పెట్టుకుంటుుందని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. ఆయన మరణవార్త వారి కుటుంబానికే కాదు, దేశంలో నిరుద్యోగ యువతకు కూడా తీరనిలోటని విచారం వ్యక్తం చేశారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల(Telangna Assembly Session) సందర్భంగా సంతాపం ప్రకటించారు. సీఎం మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రఖ్యాతి పొందిన మన్మోహన్​ సింగ్​ దేశానికి ఎన్నో రంగాల్లో సేవలు అందించారన్నారు. ప్రధానమంత్రిగా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా, ఆర్బీఐ గవర్నర్​గా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా, యూజీసీ ఛైర్మన్​గా వివిధ హోదాల్లో దేశానికి సేవలను అందించారని ముఖ్యమంత్రి తెలిపారు. దేశంలో ఆర్థిక సంస్కరణల రూపశిల్పి అని ఆయన అన్నారు. 1991 నుంచి 1996 కేంద్ర ఆర్థిక వ్యవస్థను సరిళీకరించి దశ, దిశను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారత ఆర్థిక వ్యవస్థను సుస్థిరంగా నిలబడేలా చేశారన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​ సంతాపం తెలపడానికి సమావేశమైన అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి సంతాప తీర్మాణాన్ని ప్రవేశపెట్టారు. ఆయనకు భారత రత్ని ఇవ్వాలన్ని తీర్మాణాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్​రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రిగా ఎన్నో చారిత్ర్మకమైన సామాజిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని రేవంత్​రెడ్డి అన్నారు.

భూమిలేని కూలీలకు, పేదలకు 100 రోజులు పని కల్పించాలనే ఉద్దే్శ్యంతో ఉమ్మడి ఏపీలో అనంతపురం, తెలంగాణలో మహబూబ్ నగర్ లో జాతీయ ఉపాధి హామీ పథకం ప్రారంభించి దేశానికి అంకితం చేశారు. అలాగే ఫుడ్ సెక్యూరిటీ, సమాచార హక్కు చట్టాలను తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్​సింగ్​అని అన్నారు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషనను, ఆధార్​కార్డు , 2013 భూసేకరణ చట్టం తెచ్చి భూమి లేని పేదలకు మేలు జరిగేలా చేశారు. గ్రామాల్లో ముంపుకు గురై, నిరాశ్రయులైన,పేదలకు, కుల,చేతి వ్రుత్తులను నమ్మకున్న వారికి నష్టపరిహారాన్ని అందించేలా సమూలమైన మార్పులను తెచ్చారన్నారు. 2006 అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ అని, నేడు ఆదివాసీలు, గిరిజనుల పోడు భూములకు పట్టాలు ఇవ్వగలగడానికి కారణం ఆయనేనని, అంబేద్కర్ స్పూర్తిని కొనసాగిస్తూ ఆయన చట్టాలు తీసుకొచ్చారన్నారు. ఆయన లాంటి గొప్ప ఆర్థికవేత్త, తత్వవేత్త, మానవతా వాదిని దేశం కోల్పోవడం బాధాకరమన్నారు. దేశంలో లిబరలైజేషన్, ప్రవేటైజేషన్, గ్లోబలైజేషన్ (ఎల్పీజీ) అమలు చేసి సరిళీకృత ఆర్థిక విధానాలను తీసుకవచ్చి , ప్రపంచంతో మన దేశాన్ని పోటీ పడే విధంగా తీర్చిదిద్దడంలో ఆయన కృషి మరవలేనిదని అన్నారు. ప్రపంచంతో దేశం పోటీ పడుతున్నందంటే ఆనాటి ప్రధాని పీవీ నరసింహరావు నాయకత్వంలో ఆర్ధిక శాఖ మంత్రిగా మన్మోహన్​ సింగ్​తీసుకున్న నిర్ణయాలే కారణమని ఆయన అన్నారు. మన్మోహన్ సింగ్​ప్రపంచమే గర్వించదగ్గ ఆర్థిక వేత్త మన్మోహన్​అని ఆయన అన్నారు. ఆర్థికవేత్తను కోల్పోవడం తీరని లోటు అని ఆయన అన్నారు. దేశం గొప్ప నాయకుడిని కోల్పోవడం జరిగిందన్నారు. నీతి, నిజాయితీ, ఉదారత అని ఏవరినైనా ఉదహరించాల్సి వస్తే అది మన్మోహన్ సింగ్​ఒక్కరేనని ఆయన అన్నారు. రోల్​ మోడల్​గా ఏవరినైనా తీసుకోవాల్సి వస్తే ఈ తరంలో మన్మోహన్​ సింగ్​తో పోటీ పడే వారే లేరన్నారు. పారదర్శక పరిపాలన అందించాలన్నా, ప్రజలకు ఉపయోగపడే అంశాలున్నా చట్టంలో ఎలాంటి మార్పులకు తీసుకురావడానికైనా వెనకాడేవారు కాదన్నారు.

తెలంగాణ ఆత్మబంధువు మన్మోహన్..

మన్మోహన్ సింగ్ అరవై ఏళ్ల తెలంగాణ కలను సాకారం చేసిన నాయకుడు, తెలంగాణకు ఆత్మబంధువు అని సీఎం అన్నారు. ప్రధాని హోదాలో తెలంగాణకు రాష్ట్ర హొదా కల్పించిన గొప్ప మానవతా వాది అన్నారు. రాష్ట్రం ఉన్నంత ఆయనను తెలంగాణ ప్రజలు మరిచిపోలేరన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు మన్మోహన్​సింగ్​కు ఎంతో రుణపడి ఉన్నారని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి అన్నారు. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే మార్గం సుగమమైందని అన్నారు. మన్మోహన్ సింగ్​ దేశానికి, తెలంగాణ ఏర్పాటుకు చేసిన కృషికి అసెంబ్లీ ఆపారమైన కృతజ్జతలు తెలుపుతుందన్నారు. మన దేశ మేధా సంపత్తిని ప్రపంచానికి ఎగుమతి చేయడానికి, ఈ రోజు ప్రపంచంలో ఐటీ, ఆర్థిక రంగాలనే కాకుండా, ప్రపంచ స్థాయిలో సాంకేతిక రంగాలని శాసించే స్థాయికి మనం రావడానికి కారణం మన్మోహన్ సింగ్ అని సీఎం అన్నారు. తెలంగాణతో ఆయన అనుబంధం విడదీయలేనిదని, ఉద్యమాన్ని, ప్రజల మనోభాలను అర్థం చేసుకుని రాష్ట్ర ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన వ్యక్తిగా, బిల్లును రెండు సభల్లో పాస్ చేయించిన సారథిగా ఆయన సేవలు మరువలేనివన్నారు. తెలంగాణ ఏర్పాటు వెనక్కి వెళుతుందన్న సమయంలో ఆయనకు అత్యంత సన్నిహితుడైన జైపాల్ రెడ్డి తో ఆయన తీసుకున్న వ్యూహాత్మకంగా నిర్ణయాలు తెలంగాణ ప్రజలు గుర్తుంచుకుంటారన్నారు.

భారతరత్న ఇవ్వాలి..

భవిష్యత్​ తరాలకు ఆయన మార్గదర్శి అని ఆయన అన్నారు. యువతరానికి ఆదర్శప్రాయుడు మన్మోహన్ సింగ్​అని అన్నారు. మన్మోహన్​ సింగ్​కు భారత రత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మాణాన్ని సీఎం రేవంత్​రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ తీర్మాణానికి ప్రతి ఒక్కరు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. దేశంలో మన్మోహన్​సింగ్​గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని సీఎం అన్నారు. ఫైనాన్షియల్ డిస్టిక్ లో ఆయన విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని, ప్రజలందరూ మన్మోహన్ సింగ్ ను సేవలు గుర్తు పెట్టుకునేలా ఏర్పాటు చేస్తామన్నారు. ఆయనపై మౌనముని, యాక్సిడెంటల్ ప్రధాని అని మీడియా, రాజకీయాల్లో ఎవరు ఎన్ని ఎన్ని రకాలుగా విమర్శలు చేసినా పట్టించుకోకుండా, పనినే ధ్యాసగా పనిచేశారన్నారు. ఈ దేశ ప్రజలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడం, వారి కోసమే జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి మన్మోహన్​సింగ్​అని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్ధే్శ్యంతో ఆయన సింప్లిసిటి మనిషి అని, తాను ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్​లో ధర్నా చేస్తున్నప్పుడు మా దగ్గరకు వచ్చి మా మధ్యలో కూర్చున్నారని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారని జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారని రేవంత్​రెడ్డి అన్నారు.

Next Story