Telangana Assembly: మాజీ ఎమ్మెల్యే మృతికి అసెంబ్లీ సంతాపం

by Prasad Jukanti |   (  Updated:2024-07-24 11:18:14  IST  )

మాజీ ఎమ్మెల్యే మృతికి అసెంబ్లీ సంతాపం తెలిపింది.

Telangana Assembly: మాజీ ఎమ్మెల్యే మృతికి అసెంబ్లీ సంతాపం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలకు బుధవారం తెలంగాణ శాసనసభ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. మాజీ ఎమ్మెల్యేలు నెమరుగొమ్మల సుధాకర్ రావు, విరాసత్ రసూల్ ఖాన్, డి.శ్రీనివాస్, రమేశ్ రాథోడ్ మృతి పట్ల సభ సంతాపం వ్యక్తం చేసింది. ప్రజాప్రతినిధులుగా రాష్ట్రానికి వారు అందించిన సేవలను స్పీకర్ సభలో సంతాప ప్రతిపాదనను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చదివి వినిపించారు. వారి కుటుంబ సభ్యులకు సభ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేల ఆత్మకు శాంతి చేకూరాలని సభ్యులు మౌనం పాటించారు.

Next Story