Assembly: స్పీకర్ చాంబర్ లో బీఏసీ సమావేశం.. హజరైన అధికార, ప్రతిపక్ష సభ్యులు

by Ramesh Goud |   (  Updated:2024-12-16 08:59:07  IST  )

అసెంబ్లీ సమావేశాలపై(Assembly Sessions) స్పీకర్ ఛాంబర్(Speaker Chamber) లో బీఏసీ సమావేశం(BAC Meeting) ఏర్పాటు చేశారు.

Assembly: స్పీకర్ చాంబర్ లో బీఏసీ సమావేశం.. హజరైన అధికార, ప్రతిపక్ష సభ్యులు
X

దిశ, వెబ్ డెస్క్: అసెంబ్లీ సమావేశాలపై(Assembly Sessions) స్పీకర్ ఛాంబర్(Speaker Chamber) లో బీఏసీ సమావేశం(BAC Meeting) ఏర్పాటు చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Speaker Gaddam Prasad Kumar) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revantnh Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bahatti Vikramarka) శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హజరు కాగా.. బీఆర్ఎస్ తరుపున హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. మరో వైపు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్.. సీపీఐ పక్ష నేత కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ కూడా సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాలు ఎంత కాలం జరపాలి అనే అంశంపై స్పీకర్ ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులు చర్చించనున్నారు. ఈ నెల 23 వరకు సభను నిర్వహించాలని ప్రభుత్వ వర్గాలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై ప్రతిపక్ష సభ్యులు సభను మరి కొద్ది రోజులు అదనంగా జరపాలని స్పీకర్ ను కోరనున్నారు. ఇదిలా ఉండగా.. బీఆర్ ఎస్ నాయకులు కోరిన వాయిదా తీర్మాణాన్ని స్పీకర్ తిరస్కరించారు. ఈ అంశాన్ని బీఏసీ సమావేశంలో లేవనెత్తాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. అనంతరం అసెంబ్లీ హాల్ లో కేబినెట్ బేటీ జరగనుంది. ఈ సందర్భంగా పలు బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.

Next Story