- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Assembly: చరిత్రను మరుగున పెట్టె ప్రయత్నం.. మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ వాస్తవ చరిత్రను మరుగున పెట్టె ప్రయత్నం చేశారని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ వాస్తవ చరిత్రను మరుగున పెట్టె ప్రయత్నం చేశారని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly Meetings) జరుగుతున్నాయి. ఇందులో తెలంగాణ తల్లి విగ్రహం(Telangana Thalli statue)పై చర్చ జరిగింది. దీనిపై మంత్రి పొన్నం మాట్లాడుతూ.. సోనియా గాంధీ(Sonia Gandhi) లేకుంటే తెలంగాణ రాకపోయేదని, డిసెంబర్ 9 న తెలంగాణా ఏర్పాటు ప్రకటించిన సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తెలంగాణ చిహ్నంపై చర్చ జరుగుతుందని, తెలంగాణకు అధికారిక గేయం లేదని గుర్తించి తెలంగాణ సెంటిమెంట్ కి అనుగుణంగా మా ప్రభుత్వం రాగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గీతాన్ని అధికారికంగా ఏర్పాటు చేశామని చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడ అధికారికంగా లేదని, ఇప్పటివరకు ఉన్నది ఒక పార్టీకి సంబంధించినది తప్ప రాష్ట్ర అధికారిక విగ్రహం కాదని అన్నారు.
ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ఆవిష్కరించుకుంటున్నామని, తెలంగాణకు స్ఫూర్తి దాయకంగా ఉండాలని తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేసుకుంటున్నామని చెప్పారు. విగ్రహ నమూనా పై రాజకీయం చేసే బీఆర్ఎస్ నాయకులు.. 10 సంవత్సరాల్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఎందుకు ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. ప్రతి జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ లలో, పోలీస్ కార్యాలయాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేయాలని, ప్రతి సంవత్సరం డిసెంబర్ 9 తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాలని తెలిపారు. ప్రతిపక్షాలు రాజకీయాలకు అతీతంగా నిధులు తెచ్చుకునే విషయంలో ఉండాలని, ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ తల్లికి సేవ చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ తల్లి విగ్రహంలో రాచరికపు పాలన లేకుండా ఒకవైపు అభయ హస్తం, మరోవైపు పచ్చని పాడి పంటలు, పచ్చదనం, అభివృద్ధికి నిదర్శనంగా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని, కిరీటాలు లేకుండా.. గ్రామాల్లో కనిపించే గ్రామ వనితలాగా తెలంగాణ తల్లి విగ్రహం ఉందని, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉండేలా విగ్రహ ఏర్పాటు ఉంటుందని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడిని(BRS President KCR), కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy)ని కలిసి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాలని ఆహ్వానించామని, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి అంశమని, రాజకీయాలు వేరు తెలంగాణ అభివృద్ది వేరని వివరించారు. గత ప్రభుత్వం తెలంగాణ వాస్తవ చరిత్రను మరుగున పెట్టే ప్రయత్నం చేసిందని, అసలు సిసలైన తెలంగాణ వాళ్ళకి ప్రాధాన్యత ఉండాలని మార్పులు చేర్పులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకి అందరూ సహకరించాలని మంత్రి పొన్నం కోరారు.






