- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Assembly: శాసనసభలో ఘనంగా 76 వ గణతంత్ర వేడుకలు
by Ramesh Goud |
భారతదేశ 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ శాసనసభ ఆవరణలో జాతీయ జెండాను సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఆవిష్కరించారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: భారతదేశ 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ శాసనసభ ఆవరణలో జాతీయ జెండాను సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఆవిష్కరించారు. ముందుగా అసెంబ్లీ ఆవరణ లో ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ , జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాలకు స్పీకర్ ప్రసాద్ కుమార్ ఈ మేరకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, లేజిస్లేచర్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ శాసన సభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ హృదయ పూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Next Story






