బల్ సింగ్ కలల్ని తుడిచేసిన రిజర్వేషన్..

by Gantepaka Srikanth |

కంగ్టి మండల పరిధిలోని ఎడ్లరేగడి తాండ యువకుడు బల్ సింగ్ (మథుర లబానా బీసీ-డీ)గ్రామ ప్రజల కోసం అహర్నిశలు సేవలందిస్తూ అందరి హృదయాలను గెలుచుకున్నాడు.

బల్ సింగ్ కలల్ని తుడిచేసిన రిజర్వేషన్..
X

దిశ, కంగ్టి: కంగ్టి మండల పరిధిలోని ఎడ్లరేగడి తాండ యువకుడు బల్ సింగ్ (మథుర లబానా బీసీ-డీ)గ్రామ ప్రజల కోసం అహర్నిశలు సేవలందిస్తూ అందరి హృదయాలను గెలుచుకున్నాడు. గ్రామంలో మొత్తం 450 ఓట్లు ఉండగా, అందులో 219 మథుర లబానా (లంబాడీ) ఓటర్లు, మిగతావి ఎస్టీ ఓటర్లుగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో సర్పంచ్ పదవి బీసీ లేదా జనరల్ వర్గానికి వస్తుందన్న నమ్మకంతో బల్ సింగ్ ముందుగానే సేవా కార్యక్రమాలు చేపట్టాడు. ఎండకాలంలో తన సొంత డబ్బుతో రెండు ట్యాంకర్లను ఏర్పాటు చేసి తాండ ప్రజలకు తాగునీరు అందించాడు. గ్రామస్థుల సమస్యలు హాస్పిటల్, పోలీస్ స్టేషన్, రెవెన్యూ శాఖల్లో తలెత్తినప్పుడల్లా “నేను ఉన్నా” అని ముందుండి పరిష్కరించేవాడు. ఒక్క రూపాయి కూడా ఆశించకుండా చేసిన ఈ సేవలకు ప్రజల్లో విశేష గుర్తింపు సంపాదించాడు. అయితే, చివరికి సర్పంచ్ పదవి రిజర్వేషన్ కారణంగా వేరే వర్గానికి వెళ్ళిపోవడంతో బల్ సింగ్ ఆశలు ఒక్కసారిగా ఛిద్రమయ్యాయి. అయినప్పటికీ, ప్రజల మనసుల్లో ఆయన నిజమైన నాయకుడిగా నిలిచారు.

Next Story