కాంగ్రెస్ గురించి అయ్య KCRను అడుగు.. కేటీఆర్‌కు మంత్రి కోమటిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

by Kema Shiva Kumar |

కాంగ్రెస్ థర్డ్ గ్రేడ్ పార్టీ అని.. ఉప రాష్ట్రపతి అభ్యర్థిని రేవంత్ రెడ్డే పెడితే.. కచ్చితంగా వ్యతిరేకిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్‌లో హీట్‌ను పుట్టిస్తున్నాయి.

కాంగ్రెస్ గురించి అయ్య KCRను అడుగు.. కేటీఆర్‌కు మంత్రి కోమటిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ థర్డ్ గ్రేడ్ పార్టీ అని.. ఉప రాష్ట్రపతి అభ్యర్థిని రేవంత్ రెడ్డే పెడితే.. కచ్చితంగా వ్యతిరేకిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్‌లో హీట్‌ను పుట్టిస్తున్నాయి. ఉప రాష్ట్రపతి ఎన్నికల విషయంలో హస్తం పార్టీ డ్రామాలకు తెరలేపిందని అన్నారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy) తీవ్ర స్థాయిలో స్పందించారు. స్వరాష్ట్ర కాంక్షను నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ (Congress Party) మీకు థర్డ్ గ్రేడ్ పార్టీ అయిందా అంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర గురించి అయ్య కేసీఆర్‌ (KCR)ను అడిగి తెలుసుకోవాలని హితవు పలికారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో కల్వకుంట్ల కుటుంబం సోనియా గాంధీతో ఫొటోలు దిగిన విషయం మర్చిపోయిందేమోనని సెటైర్లు వేశారు. తెలంగాణ బిడ్డ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దిగడం బీఆర్ఎస్ పార్టీకీ ఏ మాత్రం ఇష్టం లేనట్లుందని కామెంట్ చేశారు. రాష్ట్రంలో అన్నదాతలు యూరియూ కోసం కష్టాలు పడుతోంది.. రాష్ట్ర ప్రభుత్వంతో కాదని, కేంద్ర సర్కారుతోనే అనే విషయం గుర్తించాలన్నారు. తమ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి గురించి మాట్లాడే కనీస అర్హత కేటీఆర్‌కు లేదని ఫైర్ అయ్యారు. త్వరలోనే బీఆర్ఎస్ అగ్ర నాయకుల అవినీతి బయటపడుతుందని.. ప్రజలే ఆ పార్టీకి తగిన రితీలు శిక్ష వేస్తారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

Next Story