CM Revanth Reddy : ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు : సీఎం రేవంత్ రెడ్డి

by Muthe.Rajitha |   (  Updated:2025-03-09 11:05:22  IST  )

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మరో కీలక ప్రకటన జారీ చేశారు.

CM Revanth Reddy : ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు : సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మరో కీలక ప్రకటన జారీ చేశారు. ఆసిఫాబాద్ లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ(Asifabad Govt Medical College)కి కొండా లక్ష్మణ్ బాపూజీ(Konda Laxman Bapuju) పేరు పెట్టనున్నట్టు ప్రకటించారు. ఆదివారం నాంపల్లి నుమాయిష్ గ్రౌండ్స్ లో నిర్వహించిన అఖిల భారత పద్మశాలి మహాసభ(All India Padmashali Mahasabha)లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ కోసం, తెలంగాణ ఉద్యమం కోసం కొండా లక్ష్యం బాపూజీ అనేక త్యాగాలు చేశారని కొనియాడారు. తెలంగాణ కోసం ఎన్నో చేశాం అని చెప్పుకునే బీఆర్ఎస్ నాయకులు ఆయన చనిపోతే కనీసం చూడటానికి కూడా వెళ్లలేదని పేర్కొన్నారు.

1939 తర్వాత రాష్ట్రంలో మళ్ళీ కులగణన(Cast Census) జరగలేదని, ఆ తర్వాత కులగణన జరిగింది మళ్ళీ ఇప్పుడేనని వెల్లడించారు. మండల్ కమిషన్ వేసి బీసీలకు రిజర్వేషన్లు పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. కులగణన ద్వారా బీసీలకు న్యాయం చేయాలన్నదే రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆశయం అని, దానిని ఎట్టి పరిస్థితులలోనూ నెరవేరుస్తామని ఆయన అన్నారు. రైతులకు ఇస్తున్నట్టు పద్మశాలీలకు కూడా సమాన ప్రాధాన్యత తమ ప్రభుత్వం ఇస్తోందని, ఎనికల్లో తమకు అండగా నిలబడిన నేతన్నలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నేతన్నలకు భారీ గుడ్ న్యూస్ ప్రకటించారు. నేతన్నలకు రూ. 33 కోట్ల రుణమాఫీ చేస్తున్నట్టు కీలక ప్రకటన చేశారు. 2017 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు ఉన్న నేతన్నల రుణాలను మాఫీ చేస్తున్నట్టు, అందులో భాగంగా మొదటి విడతలో రూ. 33 కోట్ల రుణమాఫీ చేస్తున్నట్టు సభా వేదికగా సీఎం వెల్లడించారు. అదే విధంగా రాష్ట్రంలోని మహిళా సంఘాలకు, అంగన్వాడీ టీచర్లకు ఇచ్చే రెండు చీరల తయారీకి సంబంధించిన రూ. 1.30 కోట్ల ఆర్డర్ ను నేతన్నలకు ఇచ్చామని తెలియజేశారు.

Next Story