పీఆర్​ తాత్కాలిక ఈఎన్​సీగా అశోక్​

by Muthe.Rajitha |

పంచాయతీరాజ్​ ఇంజనీరింగ్​ విభాగం తాత్కాలిక ఇంజనీరింగ్​ ఇన్​ ఛీప్​ గా ఎన్​.అశోక్​ నియమితులయ్యారు.

పీఆర్​ తాత్కాలిక ఈఎన్​సీగా అశోక్​
X

దిశ, తెలంగాణ బ్యూరో : పంచాయతీరాజ్​ ఇంజనీరింగ్​ విభాగం తాత్కాలిక ఇంజనీరింగ్​ ఇన్​ ఛీప్​ గా ఎన్​.అశోక్​ నియమితులయ్యారు. ఈ మేరకు పంచాయతీరాజ్​ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్​.శ్రీధర్​ ఆదేశాలు జారీ చేశారు. అశోక్​ ప్రస్తుతం క్వాలిటి కంట్రోల్​ చీఫ్​ ఇంజనీర్​గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఈఎన్​సీగా ఉన్న కనకరత్నం ఎసీబీ కి పట్టుబడటంతో ఆయనను ఏసీబీ అధికారులు అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. ఈ నేపథ్యంలో కొత్తగా అశోక్​ నియమితులయ్యారు. అయితే అశోక్​కు ఇంఛార్జిగా కానీ ఎఫ్​ఏసీగా కానీ పదాన్ని వాడకుండా లుక్​ ఆఫ్టర్​ అంటూ ఆదేశాల్లో పేర్కొన్నారు.

అశోక్​ వచ్చే సెప్టంబర్​లో రిటైర్​ కానున్నారు. అందు కోసమే ఆయనకు ఎఫ్​ఏసీ బాధ్యతలు అప్పగించలేదని సమాచారం. ఆదివారం పంచాయతీరాజ్​ శాఖ మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. కామారెడ్డి జిల్లాకు చెందిన అశోక్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేసి, సూరత్​లో ఎంటెక్ అభ్యసించారు. 1989లో నిర్వహించిన ఏపీపీఎస్సీ పరీక్షలో అర్హత సాధించి పంచాయతీరాజ్ విభాగంలో ఏఈఈ నియమితులయ్యారు.

Next Story