ముంబై పేలుళ్ల తీర్పుపై అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

by Muthe.Rajitha |

నేడు వెలువడిన ముంబై పేలుళ్ల తీర్పుపై AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) సంచలన వ్యాఖ్యలు చేశారు.

ముంబై పేలుళ్ల తీర్పుపై అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : నేడు వెలువడిన ముంబై పేలుళ్ల తీర్పుపై AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) సంచలన వ్యాఖ్యలు చేశారు. 2006 జులైలో జరిగిన ముంబై వరుస రైలు పేలుళ్ల కేసులో నేడు వెలువడిన తీర్పులో 12 మందిని ముంబై కోర్టు(Mumbai Court) నిర్దోషులుగా విడుదల చేసింది. 2 పేలుళ్ల కేసులో విడుదలైన 12 మంది వారి జీవితాన్ని కోల్పోయారని అన్నారు. ఆ 12 మంది ముస్లింలు చేయని నేరానికి 18 ఏళ్ళు జైల్లో ఉన్నారన్నారు. వారి ప్రైమ్ లైఫ్ ను కోల్పోయారన్నారు. ఈ పేలుళ్లలో 180 మంది మృతి చెందగా.. ఎంతోమంది గాయపడ్డారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరగలేదన్నారు. మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలని ఒవైసీ డిమాండ్ చేసారు.

Next Story