Asaduddin Owaisi : ముస్లింలకు అసదుద్దీన్ ఓవైసీ కీలక పిలుపు

by Muthe.Rajitha |   (  Updated:2025-04-24 16:09:09  IST  )

జమ్మూకాశ్మీర్లోని పహల్గంలో మంగళవారం ఉగ్రవాదులు దాడి(Pahalagam Terror Attack) చేసి 26 మంది అమాయకులను బలి తీసుకున్న విషయం తెలిసిందే.

Asaduddin Owaisi : ముస్లింలకు అసదుద్దీన్ ఓవైసీ కీలక పిలుపు
X

దిశ, వెబ్ డెస్క్ : జమ్మూకాశ్మీర్లోని పహల్గంలో మంగళవారం ఉగ్రవాదులు దాడి(Pahalagam Terror Attack) చేసి 26 మంది అమాయకులను బలి తీసుకున్న విషయం తెలిసిందే. భారత్ తో పాటు ప్రపంచాన్ని కుదుపు కుదిపేసిన ఈ ఘటనను ప్రతీ ఒక్కరూ తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ(AIMIM Cheif Asaduddin Owaisi) ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. దేశంలోని ముస్లింలు అంతా రేపటి శుక్రవారం ప్రార్థనలో నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేయాలని కోరారు. ఉగ్రవాదుల హేయమైన చర్యకు మనమంతా నిరసన తెలపాలని అన్నారు. ఇలాంటి ఘటనలను ఏ మతం కూడా సహించబోదని.. శాంతికి చిహ్నం అయిన ఇస్లాం కూడా దాడులకు వ్యతిరేకం అని పేర్కొన్నారు.

కాగా పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం.. తదుపరి కార్యచరణపై రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యర్యంలో గురువారం అఖిలపక్ష సమావేశం(All-Party Meeting) నిర్వహించారు. దీనికి అన్ని పార్టీల అగ్రనాయకులు హాజరవ్వగా.. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ కూడా హాజరయ్యారు. ఉగ్రవాద అంతంలో తమవంతు సహకారం అందిస్తామని ఆయన తెలియజేశారు.

Next Story