ఒక ఉపఎన్నిక కోసం బీజేపీ ఇంత బరితెగించాలా? Asaduddin Owaisi ఫైర్

by Bhoopathi Nagaiah |   (  Updated:2022-08-25 11:17:08  IST  )

బీజేపీపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.

Asaduddin Owaisi Asks, Why there is no Debate on Ladakh Border Crisis In Parliament
X

దిశ, డైనమిక్ బ్యూరో : బీజేపీపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. బీజేపీ ఒక ఉపఎన్నిక కోసం ఇంత బరితెగించాలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడే బీజేపీ తీరు ఇలా ఉంటే సార్వత్రిక ఎన్నికల పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అగ్నికి ఆహుతి చేద్దాం అనుకుంటున్నారా..? దుకాణాలు, పాఠశాలలు మూయించి ప్రజలను ఇళ్లలో నుంచి బయటకు రాకుండా చేసి కర్ఫ్యూ సృష్టించాలని అనుకుంటున్నారా? అంటూ నిలదీశారు. అల్లా దయతో ఇవన్నీ జరగకూడదని... తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ సృష్టిస్తున్న హింసాకాండ నుంచి విముక్తి పొందాలని ఆశిద్దాం అంటూ ఒవైసీ ట్వీట్ చేశారు.

Next Story