- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐ లవ్ మోడీ అనొచ్చు కానీ ఐ లవ్ మొహమ్మద్ అనకూడదా?: ఓవైసీ
దేశంలో ఐ లవ్ మోడీ అని చెప్పడం ఆమోదోగ్యమే కానీ ఐ లవ్ మొహమ్మద్ అని చెబితే అభ్యంతరాలు వ్యక్తం అవుతాయని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఈ దేశం ఎక్కడికి వెళుతోందని ప్రశ్నించారు.

దిశ, వెబ్ డెస్క్: దేశంలో ఐ లవ్ మోడీ అని చెప్పడం ఆమోదోగ్యమే కానీ ఐ లవ్ మొహమ్మద్ అని చెబితే అభ్యంతరాలు వ్యక్తం అవుతాయని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఈ దేశం ఎక్కడికి వెళుతోందని ప్రశ్నించారు. యూపీలోని బరేలీలో ఐ లవ్ మొహమ్మద్ పోస్టర్లపై నిరసనల నేపథ్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన ఓ సభలో ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా మోడీని ప్రేమిస్తానున్నాను అని చెబితే మీడియా కూడా సంతోషిస్తుందని అన్నారు. అదే నేను మొహమ్మద్ ను ప్రేమిస్తున్నానని చెబితే అభ్యంతరం తెలుపుతారని వ్యాఖ్యానించారు.
తాను ఒక ముస్లీం అని దానికి కారణం మొహమ్మద్ అని అన్నారు. అంతకు మించి ఏమీ లేదన్నారు. భారత స్వాతంత్య్రం కోసం 17 కోట్ల మంది భారతీయులు పోరాడారని చెప్పారు. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 26న బరేలీలో పోస్టర్లపై ఆందోళన మొదలైంది. హజ్రత్ దర్గా బయట పలువురు నిరసన తెలపగా పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులపై రాళ్లదాడి జరిగింది. ఈ నిరసనల నేపథ్యంలో అక్టోబర్ 2 నుండి ఇంట్నెట్ సేవలు నిలిపివేశారు. జిల్లాల్లో పోలీసులు, పారామిలటరీ దళాలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.






