ఓల్డ్ సిటీలో బైక్‌పై అసదుద్దీన్ (వీడియో)

by Sathputhe Rajesh |   (  Updated:2023-08-20 15:43:40  IST  )

ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఓల్డ్ సిటీలో బైక్ రైడ్ చేసి సందడి చేశారు.

ఓల్డ్ సిటీలో బైక్‌పై అసదుద్దీన్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఓల్డ్ సిటీలో బైక్ రైడ్ చేసి సందడి చేశారు. ఇండిపెండెన్స్ డే పురస్కరించుకుని బైక్ పై వెళ్లి పలు చోట్ల జాతీయ జెండా ఎగరవేశారు. ఆయన వెంట సెక్యూరిటీ సిబ్బంది సైతం బైక్‌లపై వచ్చారు. చార్మినార్ సమీపంలోని మదీనాలో ఆయన జాతీయ జెండా ఎగరవేశారు. అయితే ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. స్వతహాగా బైక్‌లంటే ఇష్టపడే అసదుద్దీన్ గతంలో సైతం సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ప్రగతి భవన్ కు బైక్‌పై వెళ్లి అందరి దృష్టిని ఆకర్షించారు.

Next Story