- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డిప్యూటీ సీఎంను కలిసిన ఆర్టిజన్ జేఏసీ నేతలు
డిప్యూటీ సీఎం భట్టిని ఆర్టిజన్ జేఏసీ నేతలు కలిశారు.

డిప్యూటీ సీఎంను కలిసిన ఆర్టిజన్ జేఏసీ నేతలు
విద్యుత్ సంస్థల ముఖ్యులతో సమావేశానికి డిప్యూటీ సీఎం హామీ
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీవీఏఈ జేఏసీ) రాష్ట్ర నాయకత్వం బుధవారం ప్రజా భవన్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిసి సమ్మె విరమణ అనంతరం చోటుచేసుకుంటున్న పరిణామాలను వివరించింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పాల్గొన్నారు. టీవీఏఈ జేఏసీ నాయకులు విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిసన్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, సమ్మె అనంతరం పరిస్థితులు, పెండింగ్ డిమాండ్లపై ఉప ముఖ్యమంత్రికి వివరించారు.
దీనిపై స్పందించిన భట్టి విక్రమార్క ట్రాన్స్‌కో, జెన్‌కో, టీజీఎస్‌పీడీసీఎల్, టీజీఎన్‌పీడీసీఎల్ సంస్థల ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్లతో టీవీఏఈ జేఏసీ నాయకుల సమావేశాన్ని గురు లేదా శుక్ర వారాల్లో నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు జేఏసీ నాయకులు తెలిపారు. సమ్మె విరమణ అనంతరం సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంపై టీవీఏఈ జేఏసీ రాష్ట్ర నాయకత్వం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపింది. విద్యుత్ కార్మికుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించే దిశగా ప్రభుత్వం ముందడుగు వేయడం పట్ల ఉద్యోగుల్లో ఆశాభావం వ్యక్తమవుతోంది.






