14న ఎల్బీ స్టేడియంలో అరైవ్ అలైవ్

by Muthe.Rajitha |

రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జగ్రత్తలపై 14వ తేదిన భారి స్థాయిలో అవగాహన కార్యక్రమాన్ని ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు.

14న ఎల్బీ స్టేడియంలో అరైవ్ అలైవ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జగ్రత్తలపై 14వ తేదిన భారి స్థాయిలో అవగాహన కార్యక్రమాన్ని ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. అరైవ్ అలైవ్ కార్యక్రమం పోస్టర్లను బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు “అరైవ్ అలైవ్” కార్య్రక్రమం చెపట్టినట్లు తెలిపారు. పోలీసు శాఖ, రవాణా శాఖ, కార్పోరెట్ సంస్థలు, సిని ప్రముఖులు , ప్రజా ప్రతినిధులు విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు పరస్పర సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు . డిసెంబర్, జనవరి నెలలో ప్రజా చైతన్యకార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ , హైదరాబాద్ సీపీ సజ్జనార్ , సైబరాబాద్ సీనీ అవినాష్ మహంతి, జాయింట్ సీపీ జోయోల్ డేవిస్, మల్టీజోన్ –1 ఐజీ చంద్ర శేఖర్ రెడ్డి, రోడ్ సెఫ్టీ ఎస్పీలు సందీప్ , మనోహల్ పాల్గొన్నారు.

Next Story