కూన శ్రీశైలం గౌడ్ అరెస్ట్.. తీవ్ర ఉద్రిక్తత

by Disha Web Desk 4 |
కూన శ్రీశైలం గౌడ్ అరెస్ట్.. తీవ్ర ఉద్రిక్తత
X

దిశ, పేట్ బషీరాబాద్: సీఎం మెదక్ పర్యటన కోసం కుత్బుల్లాపూర్ మీదుగా వెళ్లనున్న నేపథ్యంలో ముందస్తు చర్యలుగా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ ను జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. జీడిమెట్ల పారిశ్రామిక వాడ సూపర్ మాక్స్ కంపెనీ వద్ద కార్మికుల సమస్యలపై మాట్లాడడానికి వచ్చిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని నెలలుగా సూపర్ మాక్స్ కంపెనీ కార్మికులు తమ సమస్యలపై పరిశ్రమ ముందు నిరవధిక దీక్ష చేస్తున్నారు.

ఈ క్రమంలో బుధవారం సీఎం కేసీఆర్ జీడిమెట్ల మీదుగా మెదక్ వెళ్తున్నారని తెలుసుకున్న కార్మికులు ఆయనకు మెమోరండం ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుసుకున్న పోలీసులు కార్మికులను కంపెనీ లోపలికి పంపించి బయటకు రాకుండా చేస్తున్నారని తెలుసుకున్న కూన శ్రీశైలం గౌడ్ కార్మికుల తరఫున మాట్లాడటానికి అక్కడికి వెళ్లారు. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొని బాచుపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రజాకార్ల పాలన కొనసాగుతుందని దుయ్యబట్టారు.

Next Story

Most Viewed