హెచ్‌సీయూ విద్యార్థుల అరెస్ట్.. టీ బీజేపీ సంచలన ట్వీట్

by Malleboina Mahesh |   (  Updated:2025-03-30 12:00:16  IST  )

సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల అరెస్ట్ పై తెలంగాణ బీజేపీ సంచలన పోస్ట్ పెట్టింది. యూనివర్సిటీ భూముల రక్షించేందుకు ప్రయత్నించిన విద్యార్థులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించింది.

హెచ్‌సీయూ విద్యార్థుల అరెస్ట్.. టీ బీజేపీ సంచలన ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (Hyderabad Central University)లో ఉన్న 400 ఎకరాలు భూమి వేలంపై తీవ్ర వివాదం నెలకొంది. యూనివర్సిటీ లో ఉన్న ఈ భూములను వేలం (Auction of lands) వేయాలన్న ప్రభుత్వ ఆలోచనకు వ్యతిరేకంగా విద్యార్థులు గత కొద్ది రోజులుగా నిరసనలు ర్యాలీలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు పలు ప్రాంతాల్లో జేసీబీలతో చెట్లను నరికి వేస్తున్నట్లు గమనించిన విద్యార్థులు ర్యాలీగా వచ్చి నిరసనలు చేపట్టారు. దీంతో పోలీసులు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.

కాగా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల అరెస్ట్ (Arrest of students of Central University) పై తెలంగాణ బీజేపీ సంచలన పోస్ట్ (Sensational post of Telangana BJP) పెట్టింది. యూనివర్సిటీ భూముల రక్షించేందుకు ప్రయత్నించిన విద్యార్థులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా బీజేపీ తన ట్వీట్ లో ఇలా రాసుకొచ్చింది. "సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై కర్ర విరిచిన కాంగ్రెస్ ప్రభుత్వం... విద్యార్థులు అని కూడా చూడకుండా, ఈ సమెత్తైనా కనికరం చూపకుండా పశువులను లాక్కెళ్లినట్టుగా లాక్కెళ్లి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థులను నిర్బంధించింది.

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఉచిత హామీలను నెరవేర్చడానికి HCU భూములను అమ్మ దలచిన రేవంత్ రెడ్డి సర్కారుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులను "గుంట నక్కలు"గా వర్ణించిన రేవంత్ రెడ్డి అభ్యంతర వ్యాఖ్యలపై HCU విద్యార్థులు మండిపడ్డారు! కాంగ్రెస్ సర్కారు తీరుపై, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఆందోళనకు దిగారు. రేవంత్ రెడ్డి అహంకారపూరితంగా వ్యాఖ్యలను వెనుకకు తీసుకొని, భేషరతుగా క్షమాపణ చెప్పి, HCU భూముల అమ్మకాన్ని ఆపాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీ ఝలిపించిన పోలీసులు అక్రమంగా నిర్బంధించారు" అని రాసుకొచ్చారు. కాగా ఈ భూముల వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బీజేపీతో పాటు ఇతర పార్టీలు కూడా నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే.

Read More..

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్తత

Next Story