Pushapa 2 : అల్లు అర్జున్ ను అరెస్టు చేయకుంటే పుష్ప-2 అడ్డుకుంటాం: పీడీఎస్ యూ

by Prasad Jukanti |   (  Updated:2024-12-05 11:37:08  IST  )

పుష్ప-2 బెనిఫిట్ షో కోసం వచ్చిన మహిళా మృతి ఘటనపై పీడీఎస్ యూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Pushapa 2 : అల్లు అర్జున్ ను అరెస్టు చేయకుంటే పుష్ప-2 అడ్డుకుంటాం: పీడీఎస్ యూ
X

దిశ, డైనమిక్ బ్యూరో: పుష్ప-2 ((Pushpa-2) )బెనిఫిట్ షో సందర్భంగా హైదరారాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్సులోని సంధ్య థియేటర్ వద్ద నిన్న రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటనపై పీడీఎస్ యూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అభిమాని ప్రాణాన్ని బలిగొన్న టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) ను వెంటనే అరెస్టు చేయాలని పీడీఎస్ యూ (PDSU) రాష్ట్ర అధ్యక్షుడు పి. మహేశ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యంతో రేవతి అనే మహిళ చపిపోయిందని ఆమె కుమారుడు చావుబతుకుల మధ్య హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడని ఈ ఘటనకు కారణమైన అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పుష్ప-2 సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని హెచ్చరించారు. పెద్ద ఎత్తున అభిమానులు ప్రమియర్ షో కు వచ్చినప్పుడు బాధ్యతగా వ్యవహరించాల్సిన అల్లు అర్జును అందుకు విరుద్ధంగా వ్యవహిరంచారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా నిరసనలు, ఆందోళన కార్యక్రమాలకు జనం రాకుండా ఆంక్షలు విధించి, నాయకులను అక్రమంగా అరెస్టులు చేసే పోలీసులు అర్ధరాత్రి ఓ హీరో తన వ్యక్తిగత స్వలాభం కోసం వస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎలా ఆహ్వానించారో చెప్పాలన్నారు. సినిమా వినోదాలను పంచె విధంగా ఉండాలే కానీ విషాదాలను మిగిల్చేలా ఉండకూదన్నారు. ఇప్పటికే సినిమా టికెట్ల రేట్లను రూ.3 వేల వరకు పెంచి పేద, మధ్యతరగతి సినిమా అభిమానుల జేబులను గుల్ల చేశారని ధ్వజమెత్తారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. మరో వైపు ఈ ఘటనలో థియేటర్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Next Story