రైల్వే‌స్టేషన్‌లో మహిళకు డెలివరీ.. రెండు ప్రాణాలను కాపాడిన హైదరాబాద్‌కి చెందిన ఆర్మీ డాక్టర్

by Ramesh Naini |

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ రైల్వే స్టేషన్‌లో శనివారం జరిగిన ఒక అనూహ్య ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

రైల్వే‌స్టేషన్‌లో మహిళకు డెలివరీ.. రెండు ప్రాణాలను కాపాడిన హైదరాబాద్‌కి చెందిన ఆర్మీ డాక్టర్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ (Jhansi railway station) రైల్వే స్టేషన్‌లో శనివారం జరిగిన ఒక అనూహ్య ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఒక గర్భిణీ స్త్రీ ప్లాట్‌ఫామ్‌పై ప్రసవ వేదన కి గురవడంతో అక్కడ ఉన్న వారంతా ఏం చేయాలో తెలియని స్థితిలో అయోమయంలో పడ్డారు. ఆదే సమయంలో ఆర్మీలో మేజర్‌గా పని చేస్తున్న డాక్టర్ రోహిత్ (Major Rohit) బచ్వాలా దేవుడిలా అక్కడికి వచ్చారు. వెంటనే పరిస్థితి గమనించి.. రైల్వే మహిళా సిబ్బందితో కలిసి మేజర్ రోహిత్ బచ్వాలా ఆ మహిళకి స్పాట్‌లోనే డెలివరీ చేశారు. మహిళకు డెలివరీ సమయంలో ఆ ప్రాంతాన్ని రైల్వే మహిళా సిబ్బంది చుట్టూ కవర్ చేసి ఓ కవచంగా నిలిచారు.

అనతంరం తల్లి, బిడ్డను అంబులెన్స్‌లో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు సమాచారం. వివరాల వెళితే.. ఆ మహిళ తన భర్త, బిడ్డతో పన్వేల్ నుంచి బారాబంకికి పన్వేల్-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 15066లో ప్రయాణించడానికి అక్కడికి చేరుకుంది. ఆమె భర్త వైద్య సహాయం కోసం రైల్వే ఎమర్జెన్సీ నెంబర్ కి కాల్ చేశాడు కానీ అదే సమయానికి హైదరాబాద్ వెళ్లడానికి ప్లాట్ ఫామ్ వద్ద వేచి ఉన్న మేజర్ రోహిత్ సకాలంలో స్పందించడంతో రెండు నిండు ప్రాణాలు నిలబడ్డాయి. రైల్వే ఉద్యోగుల సహాయంతో హైదరాబాద్‌‌కి చెందిన ఆర్మీ మేజర్ 31 ఏళ్ల రోహిత్‌ చేసిన పనికి అక్కడ ఉన్నవారు, రైల్వే, అర్మీ అధికారులు అభినందనలు తెలియజేశారు. ఘటనకు చెందిన వార్త వైరల్ కావడంతో హాట్సాఫ్ రోహిత్ అంటూ నెటిజన్‌లు కామెంట్స్ పెట్టారు.

Next Story