హిందువులు ఎక్కువ మంది పిల్లల్ని కనండి - ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

by Naga Rani Yarlagadda |

హిందువులు ఐక్యంగా ఉంటేనే దేశం భద్రంగా ఉంటుందని, దేశం, ధర్మం లేకపోతే భవిష్యత్తు ఉండదన్నారు. అందుకే హిందువులు వీలైనంత ఎక్కువమంది పిల్లల్ని కనాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.

హిందువులు ఎక్కువ మంది పిల్లల్ని కనండి - ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: హిందువులు కుటుంబ నియంత్రణ పాటించవద్దంటూ ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువులు ఐక్యంగా ఉంటేనే దేశం భద్రంగా ఉంటుందని, దేశం, ధర్మం లేకపోతే భవిష్యత్తు ఉండదన్నారు. అందుకే హిందువులు వీలైనంత ఎక్కువమంది పిల్లల్ని కనాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే మన సంఖ్య పెరగాలన్నారు. రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని కొందరు సమర్థిస్తుండగా.. మరికొందరు మాత్రం మతం పేరుతో ఇలా మాట్లాడటం సరికాదని హితవు పలుకుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించడం వేరని, మతపరమైన అల్లర్లు సృష్టించేలా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదంటున్నారు.

Next Story