Arekapudi Gandhi: ఎన్టీఆర్ వేడుకులు ప్రభుత్వం నిర్వహించేలా కృషి చేస్తా..

by Ramesh Goud |

ఎన్టీఆర్ జయంతి, వర్థంతి వేడుకలు ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించేందుకు కృషి చేస్తానని పీఏసీ చైర్మన్ చైర్మన్(PAC Chairman), శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ(MLA Arikepudi Gandhi) అన్నారు.

Arekapudi Gandhi: ఎన్టీఆర్ వేడుకులు ప్రభుత్వం నిర్వహించేలా కృషి చేస్తా..
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్టీఆర్ జయంతి, వర్థంతి వేడుకలు ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించేందుకు కృషి చేస్తానని పీఏసీ చైర్మన్ చైర్మన్(PAC Chairman), శేరిలింగంపల్లి(Sherilingampally) ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ(MLA Arikepudi Gandhi) అన్నారు. సీనియర్ ఎన్టీఆర్ వర్థంతి(NTR Death Anniversary) సందర్భంగా నివాళులు అర్పించేందుకు ఏపీ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) ఎన్టీఆర్ ఘాట్(NTR Ghat) వద్దకు వెళ్లారు. ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణపై నారా లోకేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అరికెపూడి గాంధీ స్పందిస్తూ.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన.. ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణపై నేడు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారని, ఈ విషయం హెచ్ఎండీఏ(HMDA) అధికారులతో మాట్లాడి సమాచారం తీసుకున్నానని చెప్పారు. అలాగే ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యాన్ని ఖండిస్తున్నానని అన్నారు. ఘాట్‌ నిర్వహణ బాధ్యతలు హెచ్ఎండీఏ పరిధిలో ఉన్నాయి కాబట్టి తానే స్వయానా బాధ్యత తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని కలిసి వారి దృష్టికి తీసుకువెళ్తానని స్పష్టం చేశారు. ఘాట్ మరమ్మతులు, సుందరీకరణ పనులు వెంటనే చేపట్టేలా తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలియజేశారు. అంతేగాక రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి వేడుకలు చేపట్టేలా తాను పూర్తి బాధ్యత తీసుకుంటానని గాంధీ ఎక్స్ వేదికగా తెలుపారు.

Next Story