నువ్వు డర్టీ మైండ్ గురించి మాట్లాడుతున్నవా.. కేటీఆర్‌పై సీతక్క ఫైర్

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-21 11:00:32  IST  )

థర్డ్ గ్రేడ్ పార్టీ అంటూ కాంగ్రెస్‌పై కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క (Minister Seethakka) స్పందించారు.

నువ్వు డర్టీ మైండ్ గురించి మాట్లాడుతున్నవా.. కేటీఆర్‌పై సీతక్క ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: థర్డ్ గ్రేడ్ పార్టీ అంటూ కాంగ్రెస్‌పై కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క (Minister Seethakka) స్పందించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. థర్డ్ గ్రేడ్ అంటే ఏంటో కేటీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టినా బీఆర్ఎస్ నేతల్లో అహంకారం తగ్గడం లేదు.. ముఖ్యంగా కేటీఆర్‌లో ఇగో ఇంకా ఎక్కువైందని ఫైర్ అయ్యారు. అర్ధం లేని మాటలు మాట్లాడుతున్న కేటీఆర్‌దే డర్టీ మైండ్ అని విమర్శించారు. కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేసిన కేటీఆర్ నోట నీతులు వింటుంటే హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఒకవైపు కేసులు, మరోవైపు ఇంట్లో సమస్యలతో కేటీఆర్ ఫ్రస్టేషన్‌లో ఉన్నారని అన్నారు. తనను సొంత పార్టీ నేతలే వేధిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ముందు దానిపై స్పందించాలని కేటీఆర్‌కు సూచించారు. యూరియా ఎవరిస్తే వాళ్లకి కేటీఆర్ మద్దతు ఇస్తా అంటున్నాడు.. యూరియా ఇచ్చేది కేంద్రమని కేటీఆర్‌కు తెలియదా? అని ప్రశ్నించారు. డొంక తిరుగుడు దేనికి.. బీజేపీకి మీ మద్దతు అని చెప్పుకోవచ్చు కదా? అని అడిగారు. బీజేపీ, BRS కలిసి యూరియా కొరతను సృష్టించాయని ఆరోపించారు.

Next Story