- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? ఫైనాన్స్ కంపెనీ నడుపుతున్నారా అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (BRS Leader RS Praveen Kumar) మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాసం స్కీమ్ (Rajiv Yuva Vuikas Scheme) లో నిబంధనలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆర్ఎస్పీ.. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఈ సందర్భంగా ఆయన.. 90 శాతం రాయితీ, అన్నీ ఉచితమే కానీ నిబంధనలు వర్తిస్తాయి.. ఇవి షాపింగ్ మాల్ యాడ్స్ కావని, ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ పథకాల పనితీరు అని ఎద్దేవా చేశారు. అలాగే రుణ మాఫీ, రైతు భరోసా, యంగ్ ఇండియా స్కూల్స్, పోలీస్ సంక్షేమ పాఠశాల, రిక్రూట్మెంట్, ప్రజా పాలన, బిల్లుల చెల్లింపులు.. అన్నింటికీ ఏదో ఒక మెలిక.. ఎక్కడో ఒక వంక.. ఇట్లా ప్రతీ స్కీం ‘కండీషన్స్ అప్లై’ మోడ్ లోనే నడుస్తున్నదని హాట్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? లేక ఫైనాన్స్ కంపెనీ (Finance Company) నడుపుతున్నారా? రేవంత్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజీవ్ యువ వికాసం పేరుతో, 5 లక్షల మందికి రుణాలు ఇస్తామని చెప్తే.. దాదాపుగా పదహారు లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారని, మీకు రుణాలు ఇవ్వడం చేతకాకపోతే నేరుగా ఒప్పుకోండి.. అంతేకానీ దరఖాస్తుల సంఖ్య తగ్గించడానికి చిల్లర రాజకీయాలు చేయకండి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అకస్మాత్తుగా సిబిల్ (CIBIL) ఉండాలని షరతులు పెట్టడం ఏంది? సిబిల్ స్కోర్ ఉండాలనే అంశం మీరు ముందు విడుదల చేసిన గైడ్ లైన్స్ లో ఎందుకు పెట్టలేదు? మీరు బ్యాంక్ మేనేజరా? రాష్ట్ర ముఖ్యమంత్రా? అని ఫైర్ అయ్యారు. ఇక చెప్పేదొక్కటి.. చేసేదొక్కటా? ఇప్పటివరకు చెప్పింది చెప్పినట్టు ఒక్క పనైనా చేశారా? ప్రతి దానికి ఏదో ఒక మెలిక పెడుతూనే ఉన్నారు! అంటూ.. తెలంగాణ ప్రజలను ఎందుకు ఇట్ల రోజూ మోసం చేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ రాసుకొచ్చారు.






