- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీలో చేరిన వెంటన మనసులో మాట బయటపెట్టిన ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు
తనకు బీజేపీ.. ఆదిలాబాద్ పార్లమెంట్ టికెట్ ఇస్తుందని ఆశిస్తున్నానని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు అన్నారు. ఢిల్లీలో ఆయన బీజేపీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో

X
దిశ, తెలంగాణ బ్యూరో: తనకు బీజేపీ.. ఆదిలాబాద్ పార్లమెంట్ టికెట్ ఇస్తుందని ఆశిస్తున్నానని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు అన్నారు. ఢిల్లీలో ఆయన బీజేపీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఉపాధ్యాయ వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. ఆదిలాబాద్ వంటి వెనుకబడిన జిల్లాకు చెందినవాడిననని, ఈ జిల్లాకు చెందిన ముగ్గురు ట్రైబల్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ టికెట్లు ఇవ్వలేదని ఆయన విమర్శలు చేశారు. కనీసం ఆయన్ను కలిసేందుకు ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదని ఆయన విమర్శలు చేశారు. బోథ్ బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావును గెలిపిస్తామని, తన కేడర్ తనతోనే ఉందిని బాపూరావు వెల్లడించారు.
Next Story






