‘పొదుపు మంత్రం చెప్పి ప్రజలపై భారమా?’ పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై సీపీఐ పోరుబాట

by Ramesh Naini |

కేంద్ర ప్రభుత్వం వాణిజ్య సిలెండర్స్‌పై 1000 పెంచి.. నెల రోజుల లోపే తాజాగా పెట్రోల్, డీజీల్ ధరలను దాదాపు రూ. 3 పెంచి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు.

‘పొదుపు మంత్రం చెప్పి ప్రజలపై భారమా?’ పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై సీపీఐ పోరుబాట
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం వాణిజ్య సిలెండర్స్‌పై 1000 పెంచి.. నెల రోజుల లోపే తాజాగా పెట్రోల్, డీజీల్ ధరలను దాదాపు రూ. 3 పెంచి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ సభలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ పొదుపు మంత్రం జపించిన కొన్ని రోజులకే పెట్రోల్, డీజీల్ ధరలను పెంచి సామాన్య ప్రజల నడ్డి విరిచిందని, తాజాగా పెంచిన పెట్రోల్ ధరలతో నిత్యావసర వస్తువుల ధరలు ప్రజల మీద భారం పడుతుందని అన్నారు.

5 రాష్ట్రాల ఎన్నికల ముందు చమురు, గ్యాస్ నిల్వలు బాగా ఉన్నాయని, అమెరికా`ఇరాన్ యుద్ధం వలన భారతదేశానికి ఎలాంటి నష్టం లేదని చెప్పిన ప్రభుత్వం ఎందుకు ధరలను పెంచిందని వారు ప్రశ్నించారు. పెంచిన ఇంధన ధరలు తగ్గించాలని శనివారం రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో అన్ని జిల్లా, మండల, గ్రామ/బస్తీ శాఖలలో నిరసన ధర్నాలు చేపట్టాలని కూనంనేని సాంబశివరావు శ్రేణులకు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.

Next Story