- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG News : కొత్త మంత్రులకు కేటాయించే శాఖలు ఇవేనా?
తెలంగాణ(Telangana) కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న కేబినెట్ విస్తరణ(Cabinet Expansion) నేడు జరిగింది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana) కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న కేబినెట్ విస్తరణ(Cabinet Expansion) నేడు జరిగింది. కేబినెట్ లోకి కొత్తగా ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి(Vivek Venkataswamy), ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Adluri Laxman Kumar), మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి(Vakiti Srihari)లకు కేబినెట్ లో చోటు దక్కగా.. వారిచేత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev Verma) రాజ్ భవన్ లో వారిచేత ప్రమాణ స్వీకారం చేయించారు.
అయితే ఇపుడు ఈ మంత్రులకు ఏ శాఖలు కేటాయిస్తారనే చర్చ జోరందుకుంది. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) దగ్గర ఉన్న శాఖలే వీరికి కేటాయిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సీఎం దగ్గర హోంశాఖ, మున్సిపల్, విద్య, మైనార్టీ శాఖలు ఉన్నాయి. వీటిలో ఏవి ఎవరికి ఇవ్వనున్నారు అనే విషయం ఈరోజు సాయంత్రానికి క్లారిటీ రానుంది.






