- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking News : 2008 డీఎస్సీ బాధితులకు నియామక పత్రాలు
తెలంగాణ సర్కార్(Telangana Govt) 2008 డీఎస్సీ బాధితులకు గుడ్ న్యూస్ తెలిపింది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సర్కార్(Telangana Govt) 2008 డీఎస్సీ బాధితులకు గుడ్ న్యూస్ తెలిపింది. 2008 డీఎస్సీ(2008 DSc) బాధితులకు కాంట్రాక్టు టీచర్(Contract Teachers)ఉద్యోగాలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1382 మందికి కాంట్రాక్టు విధానంలో ఉద్యోగం కల్పిస్తూ స్కూల్ఎడ్యుకేషన్డైరెక్టర్ఈవీ నర్సింహరెడ్డి శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వీరి కాంట్రాక్టు విధానంలో ప్రతి నెల రూ.31040 వేతనంలో నియమించనున్నట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరి సర్వీసు ప్రతి సంవత్సరం విద్యా సంవత్సరం చివరి రోజును ముగిసి తదుపరి విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి విద్యాశాఖ అవసరాలకు అనుగుణంగా నియామకం చేసుకుంటారు. వీరికి ఉద్యోగాలు కల్పించనున్నట్లుగా కాంగ్రెస్పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. వీరికి ఉద్యోగాలు కాంట్రాక్టు విధానంలో ఇవ్వాలంటూ ప్రభుత్వం క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నది. దానికి అనుగుణంగా పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వీరు ఎన్ని సార్లు వేడుకున్న స్పందించలేదు. దీంతో వీరు కోర్టును ఆశ్రయించారు. వీరికి ఉద్యోగాల ఉత్వర్వులు ఇవ్వాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.






