తెలంగాణ జాగృతి కమిటీల నియామకం

by Muthe.Rajitha |   (  Updated:2025-08-14 17:07:13  IST  )

తెలంగాణ జాగృతి సంస్థాగత నిర్మాణంలో భాగంగా పలు అనుబంధ విభాగాలకు అధ్యక్షులతోపాటు 11 జిల్లాలకు అధ్యక్షులను నియమించామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో తెలిపారు.

తెలంగాణ జాగృతి కమిటీల నియామకం
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ జాగృతి సంస్థాగత నిర్మాణంలో భాగంగా పలు అనుబంధ విభాగాలకు అధ్యక్షులతోపాటు 11 జిల్లాలకు అధ్యక్షులను నియమించామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో తెలిపారు. నూతన నియామకాలు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. నూతన బాధ్యులు సంస్థ బలోపేతానికి, ఆశయాల సాధనకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ జాగృతి ఏర్పాటు నుంచి సంస్థాగత పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ఈ నియామకాల్లోనూ ఆయా కులాలతో పాటు మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు.

11 జిల్లాలకు అధ్యక్షులను నియమిస్తే వారిలో ఐదుగురు బీసీలు, ఇద్దరు ఎస్సీలు, ఒకరు ఎస్టీ ఉన్నారని తెలిపారు. అనుబంధ విభాగాల అధ్యక్షులు, ఉపాధ్యక్షుల నియామకాల్లోనూ సామాజిక న్యాయం పాటించామని పేర్కొన్నారు. జాగృతి ఆర్గనైజింగ్ సెక్రెటరీగా దూగుంట్ల నరేష్ ప్రజాపతి, అధికార ప్రతినిధిగా నలమాస శ్రీకాంత్ గౌడ్‌ను నియమించారు. అలాగే.. ఆదివాసీ జాగృతి రాష్ట్ర అధ్యక్షుడిగా లోకిని రాజును, బీసీ జాగృతి రాష్ట్ర అధ్యక్షుడిగా ఇత్తరి మారయ్య, ఉపాధ్యక్షుడిగా ఈగ సంతోష్ ముదిరాజ్‌ను నియమించినట్లు తెలిపారు.

తెలంగాణ జాగృతి ఎంబీసీ అండ్ సంచార జాతుల విభాగానికి రాచమల్ల బాలక్రిష్ణ, సింగరేణి జాగృతి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎల్.వెంకటేశ్, తెలంగాణ జాగృతి మహిళా సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా మేక లలిత యాదవ్, తెలంగాణ జాగృతి యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడిగా కంచర్ల శివారెడ్డి, ఉపాధ్యక్షులుగా అల్వాల జితేందర్ ప్రజాపతి, భూక్యా రవి రాథోడ్, పాలె నిషా లెనిన్, కంచిగారి ప్రవీణ్ ముదిరాజ్‌ను నియమించారు.

తెలంగాణ జాగృతి విద్యార్థి సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మునుకుంట్ల నవీన్ గౌడ్, హైదరాబాద్ జిల్లా విద్యార్థి అధ్యక్షుడిగా గుమ్మడి క్రాంతి కుమార్, నిజాం కాలేజ్ అధ్యక్షుడిగా వల్లకొండ అజయ్‌రెడ్డి, సాహిత్య జాగృతి రాష్ట్ర అధ్యక్షుడిగా కాంచనపల్లి గోవర్దన్ రాజు, రైతు జాగృతి రాష్ట్ర అధ్యక్షుడిగా మంథని నవీన్‌రెడ్డిని నియమించారు.

తెలంగాణ జాగృతి ఐటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా శశిధర్ గుండెబోయిన, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా హరికృష్ణ బ్రహ్మాండభేరి, తెలంగాణ జాగృతి మైనారిటీ ముస్లీం విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా మహమ్మద్ ముస్తఫా, తెలంగాణ జాగృతి మైనారిటీ క్రిస్టియన్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా జి.డేవిడ్, ఆటో జాగృతి రాష్ట్ర అధ్యక్షుడిగా మహమ్మద్ అబ్దుల్ సలీంను నియమించారు.

వివిధ జిల్లాల తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షులు..

కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఎదురుగట్ల సంపత్ గౌడ్, యాదాద్రి భువనగిరి జిల్లాకు చందుపట్ల సుజీత్ రావు, జగిత్యాల జిల్లాకు చెర్లపల్లి అమర్ దీప్ గౌడ్, నిర్మల్ జిల్లాకు భూక్యా జానూ బాయి, కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు వినోద్, మేడ్చల్ మల్కాజ్‌గిరికి రామిడి వెంకట్ రెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాకు దారమోని గణేశ్, నారాయణపేట జిల్లాకు గవినోళ్ల శ్రీనివాస్, సూర్యపేట జిల్లాకు ఎస్.క్రిష్ణవేణి, హన్మకొండ జిల్లాకు పర్లపల్లి శ్రీశైలం, భూపాలపల్లి జిల్లాకు మాడ హరీశ్ రెడ్డిని నియమించారు.

Next Story