- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్‌కు సెక్రటరీల నియామకం
by Ramesh Naini |
తెలంగాణ శాసనసభ (అసెంబ్లీ), శాసన మండలి (కౌన్సిల్)లకు వేర్వేరుగా సెక్రటరీలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ శాసనసభ (అసెంబ్లీ), శాసన మండలి (కౌన్సిల్)లకు వేర్వేరుగా సెక్రటరీలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జారీ చేసిన జీఓ ప్రకారం తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా ఉన్న ఆర్. తిరుపతిని శాసనసభ సెక్రటరీగా నియమించారు. అదేవిధంగా రాష్ట్ర శాసనసభ సెక్రటరీగా ఉన్న డా. వి. నరసింహాచార్యులును శాసనమండలి సెక్రటరీగా నియమించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ నియామకం కొనసాగనుంది. పరిపాలనా అవసరాల దృష్ట్యా ఈ నియామకాలు చేపట్టినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తాజాగా ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణ రావు ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
Next Story






